Kantara 1 : కన్నడ హీరో రిషబ్ శెట్టి మీద తెలుగు యువత తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. రిషబ్ శెట్టి నటించిన కాంతార-1 అక్టోబర్ 2న రిలీజ్ కాబోతోంది. నిన్న హైదరాబాద్ లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రిషబ్ శెట్టి అందరినీ షాక్ కు గురి చేశాడు. తెలుగు నేల మీదకు వచ్చి కన్నడ భాషలో మాట్లాడాడు. ఒక్కటంటే ఒక్క మాట కూడా తెలుగులో మాట్లాడలేదు. ఆయనకు తెలుగు రాదా అంటే మాట్లాడాలి అనుకుంటే కనీసం రెండు ముక్కలైనా మాట్లాడేవాడు కదా. హిందీ హీరో హృతిక్ రోషన్ వచ్చి తెలుగులో నాలుగు ముక్కలైనా మాట్లాడేందుకు ట్రై చేశాడు. కానీ రిషబ్ శెట్టి మాట వరసకైనా తెలుగులో ఒక్క ముక్క అనలేదు.
Read Also : Karur-Stampede : ఛీ..ఛీ.. విజయ్ ర్యాలీలో తొక్కిసలాటపై సత్యరాజ్ రియాక్ట్
మొన్న పవన్ కల్యాణ్ ఓజీ సినిమాపై కర్ణాటకలో కన్నడ సంఘాలు ఎంత రచ్చ చేశాయో చూశాం. అక్కడ తెలుగులో పాటలు పెడితేనే బాక్సులు బంద్ చేయించి మరీ పెద్ద గొడవ చేశారు. అంతకు ముందు హరిహర వీరమల్లు సినిమా ఫ్లెక్సీలను తెలుగులో ఉంటే చింపేశారు. అంత చిన్న విషయానికే అంత చేశారు కదా.. మరి తెలుగు గడ్డ మీదకు వచ్చిన రిషబ్ ఎందుకు తెలుగు మాట్లాడట్లేదని తెలుగు యువత ఏకిపారేస్తున్నారు. కాంతార1 ను తెలుగు రాష్ట్రాల్లో బాయ్ కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. దీంతో కాంతార1పై ఘోరమైన నెగెటివిటీ పెరిగింది. రిషబ్ కావాలనే తెలుగును అవమానించారంటూ చెబుతున్నారు. ఎందుకంటే ఇదే రిషబ్ తమిళనాడుకు వెళ్తే తమిళంలో మాట్లాడేందుకు ట్రై చేస్తాడు. ముంబై వెళ్తే హిందీ మాట్లాడేందుకు ట్రై చేస్తాడు. కానీ హైదరాబాద్ వస్తే మాత్రం తెలుగు తెలియదన్నట్టు బిహేవ్ చేశాడు. తెలుగు అంటే అంత చిన్నచూపా అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు.