Love Couple Suicide: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అయోధ్యలోని గౌరీ శంకర్ ప్యాలెస్ హోమ్‌స్టేలో ప్రేమజంట మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ విషయం పోలీసులకు సమాచారం అందడంతో.. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆ యువకుడు, యువతి ప్రేమికులను తేల్చారు. మృతులను డియోరియా నివాసి ఆయుష్ కుమార్, బారాబంకిలోని దరియాబాద్‌కి చెందిన అరోమాగా గుర్తించారు.
ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న ఉదంతం మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లాలో వెలుగు చూసింది. కదులుతున్న రైలు నుంచి దూకి ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. రైలు నుంచి దూకిన తర్వాత యువకుడి మృతదేహం పిల్లర్‌లో ఇరుక్కుపోగా, బాలిక మృతదేహం నదిలో తేలింది. విషయం వెలుగులోకి రావడంతో ఛతర్‌పూర్ పోలీసులు విచారణ ప్రారంభించారు.
గుంటూరు జిల్లాకు చెందిన మహేష్, కృష్ణా జిల్లాకు చెందిన శైలు.. హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో పనిచేస్తున్నారు.. అక్కడ ప్రారంభమైన వారి పరిచయం కాస్తా ప్రేమగా మారింది.. ఈ నేపథ్యంలో వారం రోజుల నుంచి పెద్దలకు కనపడకుండా వెళ్లిపోయారు.. దీంతో.. యువతి సైలు కుటుంబ సభ్యులు నందిగం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ప్రేమజంట.. తమ ప్రేమకు పెద్దలు అడ్డుగా వస్తారని భావించి, భయపడి ఈ తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడ్డినట్టుగా తెలుస్తోంది.
ప్రేమించుకోవడం.. పెద్దలు అంగీకరించకపోవడం.. పెద్దలను ఒప్పించలేక ఎక్కడికో వెళ్లిపోయి పెళ్లి చేసుకోవడం.. విడిచి ఉండలేక, కలిసి బ్రతకలేక.. ప్రాణాలు విడిచిన ఘటనలు ఎన్నో చూశాం.. తాజాగా. విశాఖ నగరంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం కలకలం రేపింది. మెడలో తాళి కట్టిన మరుక్షణమే వారిద్దరూ ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిక్కోలు జిల్లా లావేరు, దూసి ప్రాంతాలకు చెందిన దామోదర్ (23), సంతోషి కుమారి సోమవారం…