బ్యాంకులో దోపిడీ అంటే మామూలు విషయం కాదు.. అది కూడా పట్టపగలు.. ఓ వైపు సెక్యూరిటీ.. మరోవైపు బ్యాంకులో హడావిడి.. అదే, తనకు అదునుగా మలచుకున్నాడో బాలుడు.. అలా వచ్చి.. ఇలా క్యాష్ బ్యాగ్‌తో జారుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది.. హడావిడి లేదు, బెదిరింపులు అసలేలేవు.. కానీ, రూ.35 లక్షలు మాత్రం ఎత్తుకెళ్లాడు.. పంజాబ్ పటియాలాలో జరిగిన ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. షెరాన్వాలా గేట్ ప్రాంతంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ. 35 లక్షలు కాజేశాడు ఓ బాలుడు… డబ్బు ఎలా పోయిందని అంతా జుట్టు పీకున్నారు.. కానీ, సీసీటీవీల్లో సంబంధిత దృశ్యాలు చూసి అంతా షాక్ అయ్యారు..
Read Also: Supreme Court: ఉచితాలపై కీలక వ్యాఖ్యలు.. నిపుణుల కమిటీ..!
బుధవారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో బ్యాంకులోకి 25 ఏళ్ల ఓ యువకుడితో బ్యాంకులోకి ప్రవేశించిన బాలుడు.. 25 నిమిషాల పాటు అక్కడ రెక్కీ నిర్వహించాడు.. ఆ తర్వాత ఎవరి కంటా పడకుండా.. మరెవరికీ అనుమానం రాకుండా.. ఏటీఎంలో డిపాజిట్ చేయడానికి సిద్ధం చేసిన డబ్బును చూశాడు.. క్యాష్‌ను బ్యాగ్‌లో పెట్టడాన్ని గమనించాడు.. అదును చూసి.. ఆ బ్యాగుతో మెల్లిగా జారుకున్నారు.. ఈ ఘటన మొత్తం ఎవరూ గమనించలేకపోయినా.. సీసీ టీవీల్లో మొత్తం రికార్డు అయ్యింది.. వీడియో ఫుటేజీలో మైనర్ బాలుడు బ్యాగ్‌ని తీసుకుని, ఎటువంటి అనుమానం రాకుండా క్యాజువల్‌గా స్పాట్ నుండి తప్పించుకున్నాడు. నివేదికల ప్రకారం, నిందితుడు బ్యాంకు నుండి ఈ-రిక్షా బుక్‌చేసుకుని పరారైనట్టు తెలుస్తోంది..
ఈ ఘటనతో బ్యాంకు అధికారులు పోలీసులకు సమాచారం అందించగా, పోలీసు బృందం బ్యాంకు వద్దకు చేరుకుంది. మైనర్ నిందితుడిని మరియు అతని సహచరుడిని గుర్తించి పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.. సాధారణంగా బ్యాంకు దోపిడీలు అనగానే మాస్క్‌లు మరియు తుపాకీలతో అల్లకల్లోలం కలిగించే ఘటనలు ఉంటాయి.. ఆ తర్వాత నగదు సంచులతో అక్కడి నుండి పారిపోవడాన్ని గురించి తరచూ వింటుంటాం.. కానీ, ఎలాంటి హడావిడి లేకుండా.. సింపుల్‌గా అలా రూ.35 లక్షలు నొక్కేయడం మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.. ఇది వారి తెలివా? లేక బ్యాంకు సెక్యూరిటీ, సిబ్బంది వైఫల్యామా? అనేది పక్కన పెడితే.. మైనర్లు ఇలా దోపిడీలకు పురిగొల్పడం ఆందోళన కలిగించే విషయం.