అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. విదేశాలనుంచి బంగారం, డ్రగ్స్, ఇతర నిషేధిత వస్తువులు తెస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. తాజాఆ కోల్ కత్తా లో కోటి రూపాయల విలువ చేసే మూడు అరుదైన విదేశీ కోతులను పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. ఈ కోతులను విదేశాల నుండి అస్సాం మీదుగా బెంగాల్ లోని సిలిగురికి రవాణా చేస్తున్నారు కేటుగాళ్లు. విశ్వసనీయ సమాచారం మేరకు మైనాగురి జాతీయ రహదారి పై ఓ బస్సు ను అడ్డుకున్నారు కస్టమ్స్ బృందం. బస్సు ను క్షుణ్ణంగా తనిఖీలు…