ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో సభ్య సమాజం అసహ్యించుకునే ఘటనలో కోర్టు ఇద్దరికి జీవిత ఖైదు శిక్ష విధించింది. మామ, కోడలు వివాహేతర బంధాన్ని చూసిన చిన్నారిని ఇద్దరూ కలిసి హత్య చేశారు. ఈ కేసులో సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత దోషులిద్దరికీ జీవిత ఖైదు విధించింది కోర్టు. ఈ వృద్ధుడి పేరు నరసింహారావు. ఇద్దరి స్వస్థలం ఖమ్మం జిల్లా బోనకల్లు. నిజానికి వీరిద్దరూ మామా కోడళ్లు. ఇద్దరికీ వివాహేతర బంధం ఉంది.. సునీత భర్త హరికృష్ణ ట్రాలీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతను బయటకు వెళ్లిన సమయంలో మామ నరసింహారావుతో శారీరక సంబంధం పెట్టుకునేది. కొన్నాళ్లపాటు వీరిద్దరి బంధం బాగానే సాగింది. ఆ విషయం భర్తకు తెలియక ముందే 11 ఏళ్ల సునీత కుమార్తె చూసింది. దీంతో తన హరికృష్ణకు ఈ విషయాన్ని ఎక్కడ చెబుతుందోనని ఇద్దరూ భయపడ్డారు. దీంతో ఆ అమ్మాయిని అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేశారు.. ఓ రోజు ఇద్దరూ కలిసి 11 ఏళ్ల కూతురు మెడకు వైరు బిగించి చంపేశారు.
READ MORE: Off The Record: ఒకప్పుడు కామ్రేడ్స్ అంటే నిత్యం ఉద్యమాలు, సమస్యలపై పోరాటాలు కానీ ఇప్పుడు..!
ఆ తర్వాత సునీత.. భర్త హరికృష్ణకు కాల్ చేసి కుమార్తె ఆరోగ్యం బాగాలేదని చెప్పింది. 108 ఆంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే పాప చనిపోయిందని వైద్యులు ధృవీకరించారు. 2022 ఫిబ్రవరిలో ఈ ఘటన జరిగింది.. మరోవైపు ఆస్పత్రిలో కూతురును చూసి కుప్పకూలిపోయిన హరికృష్ణ.. మెడపై ఉన్న కమిలిన గాయాన్ని గుర్తించాడు. అదే అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి.. తమదైన శైలిలో తల్లి సునీతను విచారించారు. దీంతో తన మామతో కలిసి కూతురును చంపినట్లు ఒప్పుకుంది. ఈ కేసుకు కావాల్సిన ఆధారాలన్నింటినీ కోర్టులో సమర్పించడంతో ఇద్దరినీ కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఇద్దరికీ జీవిత ఖైదు శిక్ష విధించింది. వివాహేతర బంధం కోసం కన్నకూతురునే దారుణంగా హత్య చేసిన సునీత.. ఇప్పుడు కటకటాలపాలై జైలు ఊచలు లెక్కపెడుతోంది..
READ MORE: Marriage Fraud: పెళ్లి పేరుతో ఒంటరి మహిళను ట్రాప్ చేసి రూ. 28 కోట్ల మోసం..