ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో సభ్య సమాజం అసహ్యించుకునే ఘటనలో కోర్టు ఇద్దరికి జీవిత ఖైదు శిక్ష విధించింది. మామ, కోడలు వివాహేతర బంధాన్ని చూసిన చిన్నారిని ఇద్దరూ కలిసి హత్య చేశారు. ఈ కేసులో సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత దోషులిద్దరికీ జీవిత ఖైదు విధించింది కోర్టు. ఈ వృద్ధుడి పేరు నరసింహారావు. ఇద్దరి స్వస్థలం ఖమ్మం జిల్లా బోనకల్లు. నిజానికి వీరిద్దరూ మామా కోడళ్లు. ఇద్దరికీ వివాహేతర బంధం ఉంది..