చేసేది ఐస్‌క్రీమ్ డెలివరి… కానీ, వాడో పెద్ద క్రిమనల్.. అలాంటి, ఇలాంటి క్రిమనల్ కాదు.. ఐస్‌క్రీమ్ డెలివరీ చేసే సమయంలో.. అదునుచూసి.. మహిళలపై లైంగికదాడికి పాల్పడతాడు.. ఇక, ఆ తర్వాత వాడి అసలు రూపాన్ని బయటపెడతారు.. లైంగిక దాడి విషయాన్ని.. నీ భర్తకు, కుటుంబసభ్యులకు చెప్పేస్తానంటూ బ్లాక్‌బెయిల్ చేస్తాడు.. అందినకాడికి దండుకుంటాడు.. ఇలా ఎంతో మంది మహిళలు వాడి బ్లాక్‌మెయిల్‌కు బెదిరిపోయి.. లక్షలు సమర్పించుకున్నారు.. అయితే, దాదాపు 90 లక్షల రూపాయల వరకు ఇచ్చినా.. వాడి వేధింపులు ఆగకపోవడంతో.. ఓ మహిళ ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించడంతో.. ఆ సైకోగాడి బండారం బయటపటింది..
Read Also: Love Marriage at YSP Office: ప్రేమికులను కలిపిన ఎమ్మెల్యే.. వైసీపీ కార్యాలయంలో పెళ్లి..
కేరళలో వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. త్రిసూర్‌లోని ఇరింజలకూడ ప్రాంతంలో ఉన్న ఓ ఐస్‌క్రీమ్ పార్లర్‌లో డెలివరీబాయ్‌గా పనిచేస్తున్నాడు 28 ఏళ్ల నియాస్.. అయితే, ఆన్‌లైన్ యాప్‌లో ఐస్‌క్రీమ్‌కు ఆర్డర్ చేసింది ఓ మహిళ.. ఇక, ఐస్‌క్రీమ్ డెలివరీ ఇచ్చేందుకు ఆ మహిళ ఇంటికి వెళ్లిన నియాస్.. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.. ఆ తర్వాత అసలు రూపాన్ని బయటపెట్టాడు.. బాధితురాలిని బ్లాక్ మెయిల్ చేశాడు.. రూ. 90 లక్షలు ఇవ్వకుంటే లైంగిక దాడి గురించి నీ భర్తకు, కుమారుడికి చెబుతానని బెదిరింపులకు దిగాడు.. పరువు పోతుందని వణికిపోయిన బాధితురాలు, తన బంగారంతో పాటు స్థలాలు కుదవబెట్టి మరీ.. తనకు సాధ్యమైనప్పుడల్లా.. పలు దఫాలుగా రూ. 90 లక్షలు ఇచ్చుకుంది.. అయినా, వేధింపులు, బెదిరింపులు ఆగకపోవడంతో.. పోలీసులను ఆశ్రయించారు బాధిత మహిళ.. ఇక, కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన పోలీసులు.. నియాస్‌ను అదుపులోకి తీసుకున్నారు.. కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.. పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి.. అతడిపై ఇప్పటికే చాలా కేసులున్నాయని తేల్చారు.. ఇదే తరహాలో చాలామంది మహిళలపై లైంగికదాడికి పాల్పడి.. ఆ తర్వాత బ్లాక్ మెయిల్ చేసి.. డబ్బులు వసూలు చేసినట్టు గుర్తించారు పోలీసులు.