కేరళలోని మున్నార్‌లో ముంబైకి చెందిన మహిళా పర్యాటకురాలి పట్ల ఇద్దరు టాక్సీ డైవర్లు అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో వారిని అరెస్ట్ చేశారు. పోలీసులు. అయితే గతంలో కేరళ ప్రభుత్వం కఠినమైన ఆదేశాలిచ్చినప్పటికి.. ఇలాంటి ఘటనలు జరుగుతుండడంతో.. టాక్సీ యూనియన్‌తో కుట్ర పన్నారని ఇద్దరు పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు.
Read Also: Shocking Video: పామునే ముప్పు తిప్పలు పెట్టించిన ఓ కీటకం
పూర్తివివరాల్లోకి వెళితే.. ఒక మహిళా పర్యాటకురాలి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో, మున్నార్‌లోని టాక్సీ యూనియన్ డ్రైవర్లు తనను బెదిరించారని, పోలీసులు సహాయం చేయడానికి బదులుగా వారి ఒత్తిడికి తలొగ్గారని పర్యాటకురాలు జాన్హవి వెల్లడించింది. ఈ వీడియోలో, ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది, తాను చాలా ఆనందంతో కేరళకు వెళ్లానని .. కానీ తనకు ఇలాంటి చేదు అనుభవం ఎదురైందని ఆమె పేర్కొంది.
తాను మున్నారులో ఉన్నప్పుడు.. టాక్సీ యూనియన్ కారణంగా ఉబర్ లేదా ఓలా అక్కడ పనిచేయడం లేదని జాన్హవి తెలిపింది. అయితే తాను తన క్యాబ్ డ్రైవర్ కు ఫోన్ చేసి తన లగేజీ కారులో పెడుతుండగా అక్కడికి వచ్చిన ఆరుగురు వ్యక్తులు తనను, క్యాబ్ డ్రైవర్ ను బెదిరించారని ఆమె వెల్లడించింది. దీంతో వెంటనే పోలీసులను కలిశామని.. వారు మాకు సహాయం చేయడానికి బదులుగా.. క్సీ యూనియన్ డ్రైవర్లతో వెళ్లాలని చెప్పారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఆమె కేరళ టూరిజం అధికారులను సంప్రదించినప్పటికీ.. వారు కూడా సహాయం చేయలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.