అదృష్టం అనేది ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో ఎవరికి తెలియదు. రోజు కూరగాయలు అమ్ముకునే ఓ వ్యక్తి .. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు. పూట గడవడానికే ఇబ్బందిపడే అతడికి ఏకంగా 11 కోట్ల దీపావళి బంఫర్ లాటరీ వచ్చింది. దీంతో అతడు.. అతడి కుటుంబం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
Read Also: Bigg Boss Fight: బిగ్ బాస్ లో పొట్టుపొట్టు కొట్టుకున్న కంటెస్టెంట్స్..
పూర్తి వివరాల్లోకి వెళితే.. కూరగాయలు అమ్మితే గానీ .. పూట గడవని వ్యక్తికి అదృష్టం బంకలా పట్టింది. ఏకంగా దీపావళి బంఫర్ లాటరీలో 11కోట్ల రూపాయలు లాటరీ గెలుచుకున్నాడు రాజస్థాన్ కుచెందిన కూరగాయల వ్యాపారి అమిత్ సెహరా. రతన్ లాటరీ కేంద్రం నుంచి టికెట్ కొనుగోలు చేసిన అమిత్ ఏకంగా 11 కోట్లు సొంతం చేసుకున్నారు. అయితే లాటరీ విజేతను ప్రకటించిన సమయంలో విజేత వివరాలు నిర్వాహకులకు తెలియలేదు. కానీ, తాజాగా అమిత్ లాటరీ ఆఫీసుకు వచ్చి రుజువులు సమర్పించడంతో వివరాలు తెలిశాయి. గెలిచిన టికెట్ నంబర్ A438586 ను బటిండా నుండి కేవలం 500 రూపాయలకు కొనుగోలు చేశారు. ఇప్పుడు జైపూర్ జిల్లాలోని కోట్‌పుట్లీలో నివసిస్తున్న 32 ఏళ్ల అమిత్‌ను రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు.
Read Also: High Court: భార్యను చిత్రహింసలు పెట్టిన 85 ఏళ్ల భర్తకు జైలు శిక్ష.. హైకోర్టు సంచలన తీర్పు
నాలుగు రోజుల తర్వాత విజేత వివరాలు బయటకువచ్చాయి. తన భార్య, పిల్లలతో కలిసి పంజాబ్‌కు వచ్చి క్లైయిమ్ చేసుకున్నారు. అయితే, లాటరీ ఆఫీసుకు వచ్చేందుకూ తన దగ్గర సరిపడా డబ్బుల్లేక ఇన్నాళ్లు రాలేకపోయానని అమిత్ చెప్పినట్టు నిర్వాహకులు తెలిపారు. స్నేహితుడి దగ్గర అప్పు తీసుకొని ఆయన ఈ టికెట్ కొన్నాడని చెప్పుకొచ్చారు. అమిత్.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు కావడంతో అతడి కుటుంబ సభ్యులు, బంధువులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అమిత్ కు భార్య , ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ మొత్తం డబ్బును తమ పిల్లల చదువులకు ఖర్చు చేస్తానని చెప్పుకొచ్చాడు అమిత్. అంతేకాకుండా అప్పు ఇచ్చిన స్నేహితుడి కుమార్తెల పేరిట చెరో రూ.50 లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తానని ఆయన వెల్లడించారు..
Luck shines on Rajasthan man, wins ₹11 crore in Punjab Diwali Bumper Lottery 2025 💰🎉🪔🍀 #DiwaliBumper #LotteryWinner #Rajasthan #Punjab #GoodLuck #ViralNews
🗞️ Catch the day's latest news and updates ➠ https://t.co/UrQIrFy1Kb 🗞️ pic.twitter.com/iqeJDOjFb2— Economic Times (@EconomicTimes) November 4, 2025