ఇటీవల ఓ మైనర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ మార్నింగ్ వాక్‌కు వెళ్లిన ఇద్దరు మహిళల ప్రాణాలను బలిగొన్న ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మైనర్ డ్రైవింగ్‌పై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. తల్లిదండ్రులు వారి పిల్లలను పర్యవేక్షిస్తుండాలని, మైనర్లకు వాహనాలను అప్పగించవద్దని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు పోలీసులు.
కరీంనగర్ జిల్లాలో సంచలనం కలిగించిన కమాన్ కారు ప్రమాదంలో సంచలన అంశాలు బయట పడుతున్నాయి. కారు నడిపింది మైనర్ బాలుడని తేలింది. ఈ ప్రమాద సమయంలో కారులో మరో ఇద్దరు మైనర్లు వున్నారని అంటున్నారు. ప్రమాదం జరిగే ఐదు నిమిషాల ముందు కమాన్ చౌరస్తా లోని పెట్రోల్ బంక్ లో ఇంధనం నింపుకుని రాంగ్ రూట్ లో ఓవర్ స్పీడ్ తో డ్రైవ్ చేశాడు మైనర్ బాలుడు. డ్రైవింగ్ రాకపోవడమే ప్రమాదానికి ప్రధాన కారణం అని చెబుతున్నారు…