పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం రాఘవపూర్ గ్రామంలో దారుణం జరిగింది. పంక్చర్ షాపు యజమాని ముకేష్ దారుణ హత్యకు గురయ్యాడు. కళ్ళలో కారం కొట్టి ఇనుపరాడ్ తో బాది హత్యచేశారు దుండగులు. ముఖేష్ కుమార్ స్వస్థలం బీహార్ రాష్ట్రంలోని మహువ జిల్లా. అర్ధరాత్రి తర్వాత ఓ లారీ గాలి టైర్లకు కొట్టించుకునేందుకు వచ్చాడు లారీ డ్రైవర్.
పంక్చర్ వేయడం లేట్ అవుతుంది అనడంతో ముఖేష్ కు లారీ డ్రైవర్ కు మధ్య గొడవ జరిగింది. అతర్వాత ఒక కారులో నలుగురు వ్యక్తులుతో వచ్చిన లారీ డ్రైవర్ ముఖేష్ కుమార్ పై కారం చల్లి బండరాయితో దాడి చేసి చంపినట్లు సమాచారం అందుతోంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు. ఈఉదంతం స్థానికంగా సంచలనం కలిగించింది. హత్య వరకూ ఎలా దారితీసిందో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.