Hyderabad: చర్లపల్లి స్టేషన్‌లో మహిళా మృతదేహం.. ఎవరు ఆ మహిళ? హత్య చేసింది ఎవరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: నేరస్తులు.. పోలీసులకే సవాల్ విసురుతున్నారు. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా.. నేరాలకు మాత్రం అడ్డూ అదుపూ లేకుండా పోయింది. హైదరాబాద్‌లోని చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను ఇటీవల అత్యాధునికంగా తీర్చిదిద్దారు. కానీ అక్కడే నేరస్తులు ఓ డెడ్ బాడీని సంచిలో తీసుకు వచ్చి పడేసి.. తాపీగా ట్రెయిన్ ఎక్కి వెళ్లిపోయారు. అసలు చనిపోయిన మహిళ ఎవరు? చంపింది ఎవరు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇటీవలే అక్కడి రైల్వే స్టేషన్‌ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేశారు. చుట్టు పక్కల సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. అలాంటి ప్రాంతంలోనూ నేరాలు ఆగడం లేదు. చర్లపల్లి రైల్వే స్టేషన్ గోడను ఆనుకుని.. తెల్లటి ప్లాస్టిక్ సంచిలో నుంచి రక్తం కారడాన్ని స్థానికులు గమనించారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు.. సంచిని ఓపెన్ చేసి చూడడంతో అందులో మహిళ శవం కనిపించింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టారు పోలీసులు.
Also Read
- Gurugram Techie Couple: ‘‘ మేం ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాం’’.. టెక్కీ దంపతుల మరణం..
- Retired GST Commissioner Kidnap Case: విశాఖలో రిటైర్డ్ జీఎస్టీ కమిషనర్ కిడ్నాప్ కలకలం..
- Meerut Murder Case: భర్తను చంపి పాముకాటు డ్రామా.. భార్య, ఆమె లవర్‌కు ‘‘ఉరిశిక్ష’’..
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
Suicide Attempt: ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వకపోవడంతో కుటుంబం మొత్తం..?
ఆ మహిళ ఎవరు? ఆమెను హత్య చేసింది ఎవరు? అక్కడ ఎవరు డెడ్ బాడీని పడేశారు? హంతకులు ఎటు వెళ్లిపోయారు? అనే కోణంలో.. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న సీసీ కెమెరా ఫుటేజీల ద్వారా నిందితున్ని గుర్తించారు. 2 రోజుల క్రితం మృతదేహంతో ఓ యువకుడు ఆటోలో వచ్చినట్లు గుర్తించారు పోలీసులు. గోడ పక్కన డెడ్ బాడీతో ఉన్న సంచిని పడేశాడు. ఆ తర్వాత నేరుగా రైల్వే స్టేషన్‌లోకి వెళ్లాడు. అక్కడే లాంజ్ రూమ్‌కు చేరుకున్నాడు. తర్వాత.. అక్కడే స్నానం చేశాడు. బట్టలు మార్చుకున్నాడు. బయటకు వచ్చిన తర్వాత అస్సాం వెళ్తున్న ట్రెయిన్ ఎక్కి వెళ్లిపోయాడు.
నిందితున్ని గుర్తించినప్పటికీ.. అతడు ఎవరు? ఏంటి ? అనే విషయాలు తెలియలేదంటున్నారు పోలీసులు. అటు మహిళ ఎవరు అనేది కూడా ఇప్పటి వరకు ఎలాంటి క్లూ లభించలేదు. ప్రస్తుతానికి అన్‌నోన్ డెత్‌గా కేసు నమోదు చేశామంటున్నారు పోలీసులు. ఏవైనా సాంకేతిక ఆధారాలు దొరికితే కేసును ఛేదిస్తామని చెబుతున్నారు. మహిళ డెడ్ బాడీని గాంధీ ఆస్పత్రికి తరలించారు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళా హత్య మరువక ముందే.. చర్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే స్టేషన్‌లో మరో మహిళ మృతదేహం కలకలం రేపింది. వరుసగా ఇలాంటి ఘటనలతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది.
AP Crime: అప్పులు ఎగ్గొట్టడానికి డబుల్ మర్డర్.. రెప్పపాటులో తప్పించుకున్న మూడో వ్యక్తి..
తాజావార్తలు
-
Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
-
Smart Projectors: ఇక టీవీలతో పనేలేదు.. చీప్ రేటుకే ఇంట్లోనే మల్టీప్లెక్స్ రేంజ్ ఫీలింగ్!
-
Ind vs WI 5th T20: టాస్ గెలిచిన వెస్టిండీస్.. సిరీస్ కోసం ఇరు జట్ల పోరు
-
CJP Protest: అభిజిత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, అశుతోష్ రంకా ఇంకా జైలులో ఎందుకు?
-
YSRCP Nomination Row: ఏపీ స్థానిక ఎన్నికలపై సజ్జల సంచలన వ్యాఖ్యలు.. కూటమి ప్రభుత్వంపై విమర్శలు
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!