కాలం మారుతోంది.. కొత్త కొత్త టెక్నాలజీ పరిచయం అవుతోంది.. కొత్త యాప్స్ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.. మారుతున్న కాలంతో పాటు నేరం కూడా కొత్త రూపం దాల్చడం మొదలైంది. ఒకప్పుడు దొంగతనం చేయాలంటే దొంగలు ప్రత్యక్షంగా మీ దగ్గరకు లేదా మీ ఇంటికి రావాల్సిన అవసరం ఉండేది. కానీ, టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక మీకు సంబంధించిన వివరాలు తెలిస్తే చాలు.. ఒక్క లింక్ మీ ఫోన్ కు పంపడం ద్వారా బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు. ఒక పద్ధతి గురించి ప్రజలకు తెలియగానే.. మరో పద్ధతిలో దొంగిలించడానికి వీరి వద్ద ప్లాన్ రెడీగా ఉంటున్నట్టు చాలా ఘటనలు ఫ్రూవ్ చేశాయి కూగా.. తాజాగా వాట్సాప్ ద్వారా కూడా కొంతమంది డబ్బు పోగొట్టుకున్నామని ఫిర్యాదులు చేయడం కలకలం సృష్టిస్తోంది.. ఈ సమయంలో వాట్సప్ గ్రూప్ అడ్మిన్స్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
Read Also: Crime News: పది రూపాయల కోసం ఫ్రెండ్ను రాయితో కొట్టి చంపిన యువకుడు
ఎందుకంటే.. మీ గ్రూప్ మెంబెర్స్ డేటా అంతా క్రిమినల్స్ కి చేరిపోతోంది.. అప్రమత్తంగా ఉండాలంటూ.. సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు.. అమెరికాలోని ఎన్నారైలకు సైబర్ మోసాలు తప్పడం లేదు.. అమెరికాకి చెందిన వాట్సప్ గ్రూప్స్ నుండి డేటా సేకరిస్తున్న సైబర్ చీటర్స్… ఓ ఎన్నారై మహిళకు 1 లక్ష రూపాయల లోన్ కట్టాలని.. బెదిరింపులకు దిగారు.. అంతేకాదు.. ఆమె స్నేహితులకు కూడా వేధింపులు తప్పలేదు.. నేరుగా ఇండియా నోయిడాలోని బ్యాంక్ కి వచ్చి సెటిల్ చేసుకోవాలంటూ వార్నింగ్ ఇచ్చారు కేటుగాళ్లు.. ఇప్పటికే లక్షల రూపాయలు చీటర్స్ చేతిలో మోసపోయారు ఎన్నారైలు.. ఓ బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు.. ఈ నేపథ్యంలోనే.. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్స్.. అప్రమత్తంగా ఉండాలని.. తమ గ్రూప్‌లో యాడ్ చేసేవారిని ఓ కంటకనిపెట్టాలనే.. లేకపోతే.. డేటా మొత్తం దొంగిలించి ఎసరు పెడతారని హెచ్చరిస్తున్నారు.