Crime News: ఉత్తర పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో 20 ఏళ్ల యువకుడిని అతని స్నేహితుడు 10 రూపాయల కోసం హత్య చేశాడు. వైకంఠపూర్ అడవిలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడ్ని రామ్‌ప్రసాద్ సాహాగా గుర్తించారు పోలీసులు. కేసు నమోదు చేసి నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో, సాహా డ్రగ్ అడిక్ట్ అని, మాదకద్రవ్యాలను వాడేందుకు, అతని అవసరాలను తీర్చడానికి అతని అవసరాలను తీర్చడానికి క్రమం తప్పకుండా అడవికి వెళ్లేవాడని తేలిందని పోలీసులు తెలిపారు. అతను తన స్నేహితులు సుబ్రతా దాస్ (22), అజయ్ రాయ్ (24)తో కలిసి సోమవారం అడవికి వెళ్లాడు. డ్రగ్ ఎక్కిన తర్వాత, సాహా తన వద్ద డబ్బు లేదని గుర్తించి, మరిన్ని డ్రగ్స్ కొనడానికి సుబ్రతను రూ. 10 అడిగాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో రామ్‌ప్రసాద్‌ను సుబ్రతా దాస్ బండరాయితో కొట్టి చంపాడు. అనంతరం అడవి నుంచి వెళ్లిపోయారు. పోలీసులు బుధవారం రాత్రి సుబ్రతా దాస్, అజయ్‌ను అరెస్టు చేశారు. ఈ హత్య కేసులో మొత్తం ఎపిసోడ్‌లో అజయ్ పాత్రను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.