Tamilnadu Crime: భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడం సహజమే. చిన్న చిన్న విషయాల్లోనూ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుంటాయి. చాలా జంటలు ఈ సమస్యల్ని అప్పటికప్పుడే పరిష్కరించుకొని, తమ దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తాయి. కానీ.. కొందరు మాత్రం అలా కాదు. ప్రేమను పూర్తిగా పక్కనపెట్టేసి, ఒకరిపై మరొకరు ద్వేషం పెంచుకుంటున్నారు. ఆ ద్వేషమే వారి చేత నేరాలు చేయిస్తోంది. ఇప్పుడు ఓ భర్త కూడా తన భార్యపై ద్వేషం పెంచుకొని, కిరాతక పనికి పాల్పడ్డాడు. నడిరోడ్డుపైనే హత్య చేశాడు. ఈ ఘటన తమిళనాడులోని మధురైలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Salaar Makers: హోంబెల్ నుంచి మరో పవర్ ఫుల్ యాక్షన్ సినిమా…
మధురైలోని సౌత్‌గేట్ సప్పాని కోవిల్ వీధికి చెందిన వర్ష(19)కి ఆరు నెలల క్రితమే కీరైత్తురైకు చెందిన పళని(25)తో పెళ్లి జరిగింది. వీరిది ప్రేమ వివాహం. చాలాకాలం నుంచి ప్రేమలో మునిగితేలుతున్న ఈ జంట.. ఆరు నెలల క్రితమే పెళ్లి బంధంతో ఒక్కటైంది. మొదట్లో అంతా సాఫీగానే సాగింది. కానీ, ఆ తర్వాత వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ప్రతీ చిన్న విషయానికి గొడవపడటం మొదలుపెట్టారు. దీంతో.. నెలన్నర క్రితం భర్తని వదిలి వర్ష తన పుట్టింటికి వెళ్లింది. తిరిగి ఇంటికి రావాలని పళని ఎన్నిసార్లు కోరినా.. ఆమె రాలేదు. సరిగ్గా మాట్లాడేది కూడా కాదు. దీంతో.. భార్యపై పళని పగ పెంచుకున్నాడు. ఇంటికి తిరిగిరాని తన భార్యను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు.
Virat Kohli: ఆస్ట్రేలియా జట్టుకి కోహ్లీ చుక్కలు చూపించడం ఖాయం
కట్ చేస్తే.. శుక్రవారం మధ్యాహ్నం వర్ష ఓ దుకాణానికి వెళ్లి ఇంటికి తిరిగి ఇంటికి వెళ్తోంది. అదే సమయంలో హెల్మెట్ ధరించి బైక్‌పై అక్కడికి వచ్చిన పళని, భార్యతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. కానీ, ఆమె వినకుండా ముందుకు వెళ్లసాగింది. దీంతో కోపాద్రిక్తుడైన పళని, తనతో తెచ్చుకున్న కత్తితో దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి బైక్‌పై పరారయ్యాడు. రక్తపు మడుగులో పడివున్న వర్షను వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే.. ఆమె అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయగా.. పళని పోలీసుస్టేషన్‌లో లొంగిపోయాడు.
Pervez Musharraf: రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలనుకున్న ముషారఫ్.. కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్