Karnataka: కర్ణాటకలో దారుణం జరిగింది. పెళ్లికి ఒప్పుకోలేదని ఓ ప్రేమోన్మాది యువతి గొంతు కోసి చంపాడు. ఈ ఘటన రాష్ట్రంలోని రాయచూర్ జిల్లా సింధనూర్‌లో జరిగింది. పట్టపగలే ఈ దారుణం జరిగింది, నేరం చేసిన తర్వాత నిందితుడు పోలీసుల ముందు లొంగిపోయాడు. మరణించిన విద్యార్థిని షిఫా(24)గా గుర్తించారు. నిందితుడు టైల్స్ దుకాణంలో పనిచేసే ముబిన్‌గా గుర్తించారు.
ఏలూరులో జిల్లా సత్రంపాడులో ఓ ప్రేమోన్మాది యువతి గొంతుకోసి హత్యకు పాల్పడి.. ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఏలూరులో యువతి గొంతుకోసి ఆత్మహత్యకు పాల్పడిన యేసు రత్నం చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు.