Tollywood Primier League: హైదరాబాద్ వేదికగా సినీ, క్రీడా లోకం ఒక్కటైంది. క్రికెట్ మరియు సినిమాలపై భారతీయులకున్న మమకారాన్ని జోడిస్తూ, సరికొత్త ఆలోచనతో రూపుదిద్దుకున్న ‘టాలీవుడ్ ప్రో లీగ్’ అట్టహాసంగా ప్రారంభమైంది. నోవాటెల్ హోటల్‌లో జరిగిన ఈ వేడుకకు క్రికెట్ దిగ్గజాలు, టాలీవుడ్ ప్రముఖులు హాజరై సందడి చేశారు. భారత క్రికెట్ చరిత్రలో మరుపురాని పేర్లయిన కపిల్ దేవ్, వీరేంద్ర సెహ్వాగ్, సురేష్ రైనా చేతుల మీదుగా ఈ లీగ్ ప్రారంభం కావడం విశేషం. వీరికి తోడుగా ప్రముఖ నిర్మాత మరియు ఎఫ్‌డిసి చైర్మన్ ‘దిల్’ రాజు, నటుడు సోనూ సూద్, హీరోయిన్ రాశీ ఖన్నా, సంగీత దర్శకుడు తమన్ తదితరులు పాల్గొని ఈ లీగ్ లోగో, జెర్సీ మరియు విన్నర్స్ కప్‌ను ఆవిష్కరించారు.
నటుడు వంశీ చాగంటి, ఈబిజీ గ్రూప్ ఎం.డి ఇర్ఫాన్ ఖాన్, హరిలతో కలిసి ఈ లీగ్‌ను పట్టాలెక్కించారు. ఈ ఆలోచన ఎలా పుట్టిందో వంశీ చాగంటి వివరిస్తూ గతంలో పోలీస్ డిపార్ట్‌మెంట్‌తో కలిసి క్రికెట్ ఆడుతున్నప్పుడు, ఒక ఉన్నతాధికారి (సి.వి ఆనంద్) మరియు కానిస్టేబుల్ (లోక్‌నాథ్ నాయక్) సమన్వయంతో ఆడటం తనను ప్రభావితం చేసిందని చెప్పారు. చిత్ర పరిశ్రమలోని 24 శాఖలకు చెందిన టెక్నీషియన్లు, కార్మికులు తమ వృత్తిపరమైన హోదాలను పక్కన పెట్టి, అందరూ సమానంగా కలిసి క్రికెట్ ఆడితే ఎలా ఉంటుందనే ఆలోచన నుండే ఈ ప్రో లీగ్ పుట్టిందని తెలిపారు. ఐడియాను చెప్పగానే దిల్ రాజు వెంటనే ప్రోత్సహించి అండగా నిలిచారని ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
90Hz డిస్‌ప్లే, 50MP కెమెరా, 5,000mAh బ్యాటరీతో బడ్జెట్ సెగ్మెంట్‌లో HMD Pulse 2 లాంచ్‌కు సిద్ధం..!
ఈ క్రికెట్ సమరం ఫిబ్రవరి 13, 14, 15 మరియు 21, 22 తేదీలలో మొత్తం ఐదు రోజుల పాటు జరగనుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం ఈ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనుంది. మొత్తం ఆరు టీమ్‌లు ఈ లీగ్‌లో తలపడతాయి. ఈ జట్లకు టాలీవుడ్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థలు ఓనర్లుగా వ్యవహరిస్తారు (వారి పేర్లను ప్రస్తుతం సస్పెన్స్‌గా ఉంచారు).ఈ లీగ్ ద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని దిల్ రాజు చేతుల మీదుగా సినీ కార్మికుల సంక్షేమ కార్యక్రమాలకు కేటాయిస్తారు.