Hitech Thief: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హైటెక్ దొంగ బత్తుల ప్రభాకర్ ఉదంతం మరో మలుపు తిరిగింది. రాజమండ్రి సమీపంలో పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయిన ప్రభాకర్ ఆచూకీని ఎట్టకేలకు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతను చెన్నై సమీపంలో ఉన్నట్లు సాంకేతిక ఆధారాల ద్వారా పోలీసులు నిర్ధారించుకున్నారు. హైదరాబాద్‌లోని ప్రముఖ ‘ప్రిజం’ పబ్బులో కాల్పులు జరిపి హల్చల్ సృష్టించడంతో ప్రభాకర్ పేరు మొదటిసారి వెలుగులోకి వచ్చింది. అప్పటి నుండి అతను పోలీసులకు సవాల్‌గా మారుతూనే ఉన్నాడు.…