Fake IPS : ఫేక్ ఐపీఎస్ ఆట ముగిసింది.. అలిపిరి పోలీసుల దెబ్బ
- ప్రత్యేక దుస్తులు, మాట్లాడే తీరు
- అధికార ధోరణి అన్నింటినీ అలవాటు చేసుకున్నాడు
- ర్యాపిడో డ్రైవర్‌కు టోకరా వేసిన సురేష్ కుమార్
- ఆదాయపన్ను శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని హామీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అతడు కనిపించినప్పుడల్లా ప్రజలు గౌరవంతో నిలబడేవారు. మెరిసే దుస్తులు… గంభీర స్వరం.. చేతిలో ఫోన్.. మాటల్లో అధికార ధాటి నేను ఢిల్లీ ఎన్‌ఐఏలో ఐపీఎస్ ఆఫీసర్.. అని చెప్పగానే ఎదుటివారు నమ్మక తప్పేది కాదు. ఇంకేముంది ఆ నమ్మకాన్ని సొమ్ముగా మార్చుకోవాలని స్కెచ్ వేస్తూ తిరుపతిలో వరుసగా మోసాలకు పాల్పడుతున్న నకిలి ఐపీఎస్ అధికారిని అరెస్టు చేశారు అలిపిరి పోలీసులు. పరిచయమైన క్షణాల్లో మాటలు కలపడం వెంటనే ఆఫర్లు ఇవ్వడం అలవాటుగా చేసుకున్న అతగాడు తాజాగా ఓ రాపిడో డ్రైవర్‌ను మోసం చేసి దొరికిపోయాడు. అధికార హోదా పేరు చెప్పగానే ప్రజలు నమ్ముతారనే బలహీనతను ఆసరాగా తీసుకుని ఐపీఎస్ అధికారిగా నటిస్తూ మోసాలకు పాల్పడుతున్న కేటుగాడు తిరుపతిలో పోలీసులకు చిక్కాడు. ఢిల్లీలోని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ..NIAలో ఐపీఎస్ అధికారిగా పనిచేస్తున్నానంటూ పరిచయం చేసుకుంటూ తిరిగిన కె. సురేష్ కుమార్ అలియాస్ సూర్య అనే వ్యక్తిని అలిపిరి పోలీసులు అరెస్ట్ చేశారు..
Imran Khan: ప్రమాదకరంగా ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం.. కుడి కంటిచూపు కోల్పోయిన పాక్ మాజీ పీఎం..
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
నిందితుడు తనను తాను ఉన్నతాధికారిగా చూపించుకునేందుకు ప్రత్యేకంగా దుస్తులు, మాట్లాడే తీరు, అధికార ధోరణి అన్నింటినీ అలవాటు చేసుకున్నాడు. కేంద్ర సంస్థల్లో తనకు ఉన్న పరిచయాల ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించగలనని చెప్పి బాధితులను నమ్మించేవాడు. ఇదే తరహాలో ఒక రాపిడో డ్రైవర్‌ను లక్ష్యంగా చేసుకుని ఆదాయపన్ను శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు. ఉద్యోగం వస్తుందనే ఆశతో బాధితుడు రూ.1.50 లక్షలు నిందితుడికి ఇచ్చాడు. డబ్బులు అందుకున్న తర్వాత సురేష్ కుమార్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కనిపించకుండా పోయాడు. పలుమార్లు సంప్రదించడానికి ప్రయత్నించినా స్పందన లేకపోవడంతో బాధితుడికి అనుమానం కలిగి అలిపిరి పోలీసులను ఆశ్రయించాడు.. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కాల్ డేటా, మొబైల్ లొకేషన్ వంటి సాంకేతిక ఆధారాలను విశ్లేషించి నిందితుడి కదలికలను గుర్తించారు. ప్రత్యేక బృందం ఏర్పాటుచేసి నిఘా పెట్టి చివరకు సురేష్ కుమార్ అలియాస్ సూర్యను అరెస్టు చేశారు. నిందితుడు ఒంటరిగా పనిచేశాడా? లేక మరెవరైనా సహచరులు ఉన్నారా? ఇప్పటికే ఇలాంటి మోసాలు ఎక్కడైనా చేశాడా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అతడి ఫోన్, బ్యాంక్ లావాదేవీలు, పరిచయ వర్గం అన్నింటినీ పరిశీలిస్తున్నట్లు సమాచారం.. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బులు అడిగే వ్యక్తుల మాటలు నమ్మవద్దని, ప్రభుత్వ నియామకాలు ఎప్పుడూ అధికారిక ప్రక్రియ ద్వారానే జరుగుతాయని పోలీసులు ప్రజలకు సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు…
Parijatha Yogam 2026: రేపే పారిజాత యోగం.. ఈ 4 రాశుల వారికి అదృష్టం మామూలుగా ఉండదు.!
తాజావార్తలు
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
-
Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
ట్రెండింగ్
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..