కాదేదీ క్రైమ్‌కు అనర్హం.. అనేలా ఉంది పరిస్థితి. ఊరు లేదు.. పేరు లేదు.. ఇంకా చెప్పాలంటే అసలు దేశమే లేదు. కానీ అలాంటి దేశంలో జాబ్స్ ఇప్పిస్తానని చెప్పి ఒకడు దుకాణం తెరిచాడు. తన వలలో పడ్డ వారి దగ్గర అందినకాడికి దోచుకుంటున్నాడు. ఆ నోటా ఈ నోటా పోలీసులకు విషయం తెలియడంతో అతన్ని అరెస్ట్ చేశారు. ఇంతకీ ఆ కంత్రీగాడు ఎవరు? గబ్బర్ సింగ్ సినిమాలో హీరో పవన్ కళ్యాణ్ సొంతంగా పోలీస్ స్టేషన్ ఏర్పాటు…
ఎక్సైజ్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఫేక్ జాబ్ ఐడి కార్డులను ఫేక్ లెటర్లను తయారుచేసి బాధితులను మోసం చేసి వారి వద్ద నుంచి ఏడు లక్షల ఐదువేల రూపాయలను వసూలు చేసిన నిందితుడు హైదరాబాద్ అల్కాపురి కాలనీకి చెందిన వినయ్ కుమార్‌ను అరెస్టు చేశామని ఆదిలాబాద్ ఒకటో పట్టణ సీఐ బి సునీల్ కుమార్ తెలిపారు. బాధితుడు గంగాధర్ ఫిర్యాదుతో ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Odisha Police Busts "India's Biggest Ever" Job Fraud: దేశంలోనే అతిపెద్ద ఉద్యోగ మోసాన్ని గట్టురట్టు చేశారు ఒడిశా పోలీసులు. నిరుద్యోగులే టార్గెట్ గా జరుగుతున్న స్కామ్ ను వెలుగులోకి తీసుకువచ్చారు ఒడిశా పోలీస్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్. ఉత్తర్ ప్రదేశ్ అలీఘర్ కేంద్రంగా ఈ స్కామ్ జరుగుతోంది. ఈ స్కామ్ వల్ల ఇప్పటి వరకు 50,000 మంది నిరుద్యోగులు మోసం పోయినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశాలో…
రోజురోజుకు సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకులను టార్గెట్ చేస్తూ వారి వద్ద నుంచి లక్షలు దండుకుంటున్నారు. ఓ వ్యక్తిని బ్లాక్ మెయిల్ చేసి రూ.2.89లక్షలు వసూలు చేశారు. తనకు సంబంధించిన న్యూడ్ ఫోటోలను సదరు వ్యక్తి బంధువులకు పంపుతామని బెదిరించారు. దీంతో ఆ వ్యక్తి సైబర్ నేరగాళ్లకు డబ్బులు పంపించారు. సైబర్ నేరగాళ్ల వేధింపులు అధికమవడంతో బాధితుడు సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో పాటు మరో వ్యక్తిని ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో 4 లక్షలు మోసం చేశారు…
రోజురోజుకు మోసాలు చేసేవారు కొత్తకొత్త పంథాలను ఎంచుకుంటున్నారు. బహుమతులంటూ, ఉద్యోగాలంటూ సామాన్యుడి ఆయువుపట్టుపై కొడుతూ వారి జీవితాలను విలవిలలాడిస్తున్నారు. సైన్ అనే వెబ్‌సైట్‌లో ఓ అమ్మాయి ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంది. దాని ఆధారంగా ఆ అమ్మాయి కి కాల్ సెంటర్ నుంచి ఫోన్ చేశారు దుండగులు. ఎయిర్ టికెటింగ్ స్టాఫ్‌గా ఇండిగో ఎయిర్ లైన్స్‌లో ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఎనిమిది లక్షలు వసూలు చేశారు. ఆ తరువాత స్పందించకపోవడంతో సదరు యువతి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు…