నకిలీ ఐపీఎస్ అధికారి సూర్య ప్రకాష్ ఆగడాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ అధికారిగా హడావుడి సృష్టించిన సూర్య ప్రకాష్.. అసలు బాగోతం కుటుంబ సభ్యులు బయటపెట్టారు. ఆస్తికోసం, డబ్బుల కోసం కన్నతల్లిని, సొంత తమ్ముడిని అతని కుటుంబాన్ని కూడా బెదిరించాడు. సుమారు రూ.70 లక్షల వరకు నగదు, బంగారం, ఆస్తులు కాజేసి రోడ్డున పడేశాడు.
పార్వతీపురం మన్యం జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో సెక్యూరిటీ లోపం కనిపించింది. ఐపీఎస్ యూనిఫారంతో వచ్చిన సూర్య ప్రకాష్ అనే వ్యక్తిని విజయనగరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని నకిలీ ఐపీఎస్‌గా గుర్తించారు.
Fake IPS Officer: నకిలీ ఐపీఎస్ అధికారి రామ్‌ను సైబరాబాద్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. తక్కువ ధరకు ఉద్యోగాలు, కార్లు ఇప్పిస్తానని నిందితులు పలువురిని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. సెటిల్‌మెంట్ల కోసం హైదరాబాద్‌లో ఓ నకిలీ ఐపీఎస్ అధికారి రామ్ కార్యాలయం తెరిచాడు.
హైదరాబాద్ నగరంలో మరో దారుణం వెలుగు చూసింది. జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐపీఎస్ అధికారి పేరుతో మహిళను వేధిస్తున్న వ్యక్తిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే… మ్యాట్రీమోనీలో హరిప్రసాద్ అనే యువకుడు ఐపీఎస్ పేరుతో నకిలీ ప్రొఫైల్ క్రియేట్ చేశాడు. ఐపీఎస్ అధికారి అని ప్రొఫైల్ కనిపించడంతో ఆసక్తి కనపరిచిన మహిళలను హరిప్రసాద్ ట్రాప్ చేయడం ప్రారంభించాడు. అయితే ఓ మహిళకు అనుమానం వచ్చి ఐడీ కార్డు చూపించమని అడిగింది. దీంతో హరిప్రసాద్…