Extramarital Affair: దుబాయ్ లో భర్త ఉద్యోగం.. డబ్బుకు ఎటువంటి లోటు లేదు. ముగ్గురు రత్నంలాంటి పిల్లలు.. జీవితం హాయిగా సాగుతున్న తరుణంలో ఒక కుర్రాడి రాక ఆమె జీవితాన్ని అతలాకుతలం చేసింది. భర్త లేడుగా కుర్రాడితో కోరికలు తీర్చుకోవచ్చు అనుకున్న ఆమె ఆలోచన చివరికి ఆమెను జైలుపాలు అయ్యేలా చేసింది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని బాగల్ కోటాలో ఒక మహిళ తన ముగ్గురు పిల్లలతో నివసిస్తోంది. భర్త దుబాయ్ లో పనిచేస్తుండడంతో ఆమె ఒంటరిగా ఉంటోంది. ఇక మొదట్లో బాగానే ఉన్నా కొన్ని నెలల క్రితం ఆమెకు శృంగారంపై మోజు ఎక్కువయ్యింది. దీంతో తమ ఇంటివద్దే ఉన్న ఒక కుర్రాడితో ఆమెకు పరిచయం ఏర్పడింది.
ఇక కొద్దిరోజుల్లోనే ఆ చనువు అక్రమసంబంధానికి దారితీసింది. భర్త దుబాయ్ లో ఉండడంతో వీళ్ళ రాసలీలలను అడ్డుకోనేవారు లేకుండా పోయారు. ఇక ఆంటీ ఇచ్చే సుఖానికి అలవాటు పడ్డ కుర్రాడు ఆమెను వదలడానికి ఇష్టపడకుండా పెళ్లి చేసుకుంటాను అని వెంటపడడం ప్రారంభించాడు. దీంతో ఖంగుతిన్న ఆంటీ.. పెళ్లి, గిళ్లి ఏం లేదు.. నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయిందని చెప్పిన ఆ కుర్రాడు వినకుండా పోరు పెట్టడంతో ఆంటీ తట్టా బుట్టా సర్దుకొని బెంగుళూరు లోని బంధువుల ఇంటికి పారిపోయింది. ఆ సుఖానికి అలవాటు పడ్డ కుర్రాడు ఎలాగైనా ఆంటీని దక్కించుకోవాలని అడ్రెస్స్ తెలుసుకొని వారి బంధువుల ఇంటికి వెళ్లి ఆమెతో మాట్లాడాలని పిలిచాడు. ఆమె ససేమిరా బయటికి రాను అని చెప్పడంతో ఇంటి వద్దకు వెళ్లి మాట్లాడాడు. ఇక ఈ విషయాన్ని ఆమె బంధువులకు చెప్పడంతో వారందరు కలిసి కుర్రాడిని చితకబాదారు.. అంతేకాకుండా ఇటుక రాయితో అతడి తలపగులకొట్టి హత్యచేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు.