Devansh Yadav Death Mystery Solved By Police: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో మే 26న జరిగిన దేవాన్ష్ యాదవ్ హత్య మిస్టరీని పోలీసులు ఛేధించారు. తన కొత్త బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి, దేవాన్ష్ మాజీ ప్రియురాలే అతడ్ని హతమార్చినట్టు పోలీసులు తేల్చారు. దేవాన్ష్‌ని హత్య చేసిన తర్వాత.. దృశ్యం సినిమా తరహాలో సాక్ష్యాల్ని చెరిపేసేందుకు వాళ్లిద్దరు ప్రయత్నించారు. వాళ్లకు ఆలమ్ అనే మరో యువకుడు కూడా సహకరించాడు. పక్కా స్కెచ్‌తో అతడ్ని హత్య చేసి, ఏం తెలియనట్టుగా నటించారు. కానీ.. పోలీసులు ఎంతో చాకచక్యంగా ఈ కేసుని హ్యాండిల్ చేసి, ఎట్టకేలకు నేరస్తుల్ని పట్టుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Rajasthan Weird Marriage: వధువులు ఇద్దరు, వరుడు ఒక్కడు.. అబ్బో పెద్ద చరిత్రే
దేవాన్ష్, అనుష్క చిన్ననాటి స్నేహితులు. 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు కలిసి చదువుకున్నారు. వయసుకు వచ్చాక.. వారి స్నేహం ప్రేమగా మారింది. ఇద్దరు కలిసి కొన్నాళ్లే సహజీవనం చేశారు కూడా! అయితే.. వీరి మధ్య గొడవలు జరగడంతో, కొంత దూరం ఏర్పడింది. ఇక బనారస్ హిందూ యూనివర్సిటీలో చేరిన తర్వాత.. దేవాన్ష్‌ను అనుష్క పూర్తిగా అవాయిడ్ చేసింది. ఈ క్రమంలో ఆ యువతి రాహుల్ సేథ్‌కి దగ్గరయ్యింది. అతనితో ప్రేమలో పడింది. మరోవైపు.. దేవాన్ష్ మాత్రం అనుష్కని మర్చిపోలేకపోయాడు. మళ్లీ ఆమెకు దగ్గర అవ్వాలని ప్రయత్నించాడు. కానీ, అనుష్క మాత్రం అతడ్ని పూర్తిగా వదిలించుకోవాలని అనుకుంది. తనని డిస్టర్బ్ చేయొద్దని, తన జీవితంలో మరొకరు ఉన్నారని తేల్చి చెప్పింది. అప్పటికీ దేవాన్ష్.. నువ్వే కావాలంటే అనుష్క వెంట పడ్డాడు. దాంతో.. శాశ్వతంగా అతని అడ్డు తొలగించాలని, చంపేందుకు ప్లాన్ చేసింది.
Brahmamudi Serial: టీఆర్పీ రేటింగ్ లో దుమ్మురేపుతున్న బ్రహ్మముడి సీరియల్..
తనను కలవడానికి రావాలని అనుష్క పిలవడంతో, దేవాన్ష్ మే 25న బనారస్ వెళ్లాడు. అస్సి ఘాట్ దగ్గరలో ఓ హోటల్‌లో రూమ్ తీసుకున్నాడు. మే 26న అనుష్క ఫోన్ చేసి, ఒక చోటుకి రమ్మని దేవాన్ష్‌ని పిలిచింది. ఒక చోటుకు వెళ్దామని చెప్పి కారులో ఎక్కించింది. ఆ కారును సదాబ్ నడిపాడు. ఈ కారుని రాహుల్ వెనక నుంచి స్కూటీపై అనుసరించాడు. కారులో దేవాన్ష్ ఎక్కిన తర్వాత.. అనుష్క అతనికి మత్తు మందు కలిపిన జ్యూస్ ఇచ్చింది. అది తాగిన దేవాన్ష్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో.. అతడ్ని అలీనగర్‌కు తీసుకెళ్లి, స్ర్కూడ్రైవర్‌తో పాటు కత్తులతో విచక్షణారహితంగా పొడిచారు. అప్పటికీ అతడు చనిపోకపోవడంతో.. అతడ్ని గన్‌తో కాల్చి చంపారు. అనంతరం అతని మృతదేహాన్ని కాలువలో పడేసి, అక్కడి నుంచి వాళ్లు వెళ్లిపోయారు. కేసుని తప్పుదోవ పట్టించేందుకు, దృశ్యం సినిమా తరహాలో దేవాన్ష్ ఫోన్‌ను మరో రాష్ట్రానికి వెళ్తున్న ట్రక్‌పై పడేశారు.
Delhi Good Thieves: ‘మంచి’ దొంగలు.. పైసలు లేవని, వంద పెట్టి వెళ్లారు
మరోవైపు.. పని మీద బనారస్ వెళ్లి వస్తానని చెప్పిన దేవాన్ష్ రెండు రోజులైనా తిరిగి రాకపోవడం, ఫోన్ కూడా స్విచ్చాఫ్ వస్తుండటంతో.. అతని పేరెంట్స్ పోలీసులకు మే 29న ఫిర్యాదు చేశారు. తొలుత పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. తొలుత పోలీసులకు ఎలాంటి క్లూ లభించలేదు. అప్పుడు ‘ప్రేమ’ కోణంలో నుంచి దర్యాప్తు చేయడం ప్రారంభించగా.. ఒక్కొక్కగా క్లూ బయటపడుతూ వచ్చింది. చివరికి.. మాజీ ప్రియురాలు అనుష్కనే, తన కొత్త బాయ్‌ఫ్రెండ్ రాహుల్‌తో కలిసి చంపినట్టు తేల్చారు.