Man Married Two Woman In Same Mandap In Rajasthan: ఒకే మండపంలో రెండు వివాహాలు జరగడం సాధారణమే కానీ, ఒకే వరుడు ఇద్దరు వధువుల్ని పెళ్లాడటం మాత్రం చాలా అరుదు. ఇలాంటి అరుదైన సంఘటన రాజస్థాన్‌లోని బన్స్వారా జిల్లాలో చోటు చేసుకుంది. ఇదే పెద్ద విచిత్రం అనుకుంటే, అంతకన్నా ఆశ్చర్యానికి గురి చేసే చరిత్ర కూడా ఒకటుంది. పెళ్లికి ముందే వరుడు ఆ ఇద్దరితో సహజీవనం చేసి, పిల్లల్ని కూడా కన్నాడు. అది కూడా ఒక ఇంట్లోనే ఆ ఇద్దరితో సహజీవనం చేశాడు. అవును, మీరు చదువుతోంది అక్షరాల నిజం. ఆ వివరాల్లోకి వెళ్తే..
Adult Content: నీలిచిత్రాల కంపెనీ విచిత్ర విజ్ఞప్తి.. అడల్ట్ కంటెంట్ అంటే బోరింగ్ అనేలా చేయండి..
ఆనందపురి ప్రాంతంలోని ఉపల్‌పాడ గ్రామంలో కమలేష్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అతను 13 సంవత్సరాల వయసులోనే.. నాని దేవి అనే బాలికతో ప్రేమలో పడ్డాడు. ఆమెను సంవత్సరం తర్వాత తన ఇంటికి తీసుకొచ్చాడు. వీరికి ఎనిమిదేళ్ల కూతురు ఉంది. కట్ చేస్తే.. తొమ్మిది సంవత్సరాల క్రితం టీనా అనే మహిళ పట్ల కమలేష్ ఆకర్షితుడయ్యాడు. దీంతో ఆమెను ప్రేమించాడు. ఆ తర్వాత ఆమెను సైతం ఇంటికి తీసుకెళ్లి, సహజీవనం చేశాడు. టీనాని ఎందుకు తీసుకొచ్చావని నాని దేవి నుంచి గానీ, కుటుంబ సభ్యుల నుంచి గానీ ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం అవ్వలేదు. అతని ఇష్టాన్ని ఎవ్వరూ తిరస్కరించలేదు. అలా ఆ ఇద్దరితో ఒకే ఇంట్లోనే కాపురం పెట్టాడు.
NTR: ఎన్టీఆర్ సరసన సాయి పల్లవి.. వీరికి ఒక సాంగ్ పడితే ఉంటుంది సామీ
కానీ.. ఆ ఇద్దరిని అతడు పెళ్లి చేసుకోలేదు. ఇందుకు కారణం.. ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడమే! డబ్బులు బాగా సంపాదించిన తర్వాత పెళ్లి వేడుక చేసుకుందామని అనుకున్నాడు. అందుకు అతనికి దేవి, టీనా కూడా సహకరించారు. ముగ్గురు కష్టపడి, కొంత డబ్బు వెనకేసుకున్నాక.. ఇప్పుడు పెళ్లికి సిద్ధమయ్యారు. గిరిజన సంప్రదాయం ప్రకారం వీళ్లు వివాహం చేసుకున్నారు. కాగా.. రాజస్థాన్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని గిరిజన తెగల్లో ఇలాంటి సాంప్రదాయాలు చాలాకాలం నుంచే ఉన్నాయి. కొన్ని జంటలు వివాహాలు చేసుకోకుండానే కలిసి జీవిస్తాయి. ఆ తర్వాత డబ్బు సంపాదించుకుంటే పెళ్లి చేసుకుంటారు.