ఏ భాషలోనైనా, సిల్వర్ స్క్రీన్ ఐనా, బుల్లితెర అయినా ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకోవాలంటే భిన్నమైన కథ, కథనం కావాల్సింది. తెలుగులో బుల్లితెరపై స్టార్ మా సీరియల్స్ సత్తా చాటుతూ.. ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకుంటూ టాప్ లో దూసుకుపోతున్నాయి. స్టార్ మా సీరియల్స్ లో ఫస్ట్ ప్లేస్ నుంచి టాప్ 10లో దాదాపు 7 సీరియల్స్ స్టార్ మాలో ప్రసారం అవుతున్నాయి. అయితే ఈ సారి టాప్ ఫైవ్ లో నాగపంచమి చేరింది. టీఆర్పీ రేటింట్ లో ఫస్ట్ ప్లస్ లో బ్రహ్మముడి 12.10 రేటింగ్‌తో ఉండగా.. సెకండ్ ప్లేస్ లో 10.30 రేటింగ్‌తో నాగపంచమి ఉంది. ఇక మూడో స్థానంలో కృష్ణా ముకుందా మురారి.. 9.90 రేటింగ్‌తో నిలిచాయి.
Read Also: EPFO: అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి తేదీ పొడిగింపు..!
అయితే.. వాస్తవానికి కార్తీక దీపం సీరియల్ తర్వాత ఆ రేంజ్ లో బుల్లి తెర ప్రేక్షకుల ఆదరణను గుప్పెడంత మనసు ధారవాహిక సొంతం చేసుకుంది. టాప్ రేస్ లో కొంత కాలం దూసుకుపోయిన ఈ సీరియస్.. అయితే బ్రహ్మముడి ప్రసారం అవుతున్న తర్వాత గుప్పెడంత మనసు సీరియల్ ను కాకుండా.. బ్రహ్మముడి ధారవాహికపై తమ మనస్సును బుల్లితెర ప్రేక్షకులు పారేసుకోవడంతో ఇప్పుడు ఈ సీరియల్ టాప్ రేసులో దూసుకుపోతోంది. బ్రహ్మముడి దెబ్బకి గుప్పెడంత మనసు సీరియల్.. తన స్థానాన్ని కోల్పోయింది. ఇప్పుడు నిలకడలేని కథ కథనంతో వరుసగా టీఆర్పీ రేటింగ్ లో గుప్పెడంత మనసు సీరియల్ పాయింట్ల పట్టికలో కిందకు పడిపోయింది.
Read Also: Chiranjeevi: మాస్ డైరెక్టర్ ‘కథ’ ఓకే చేసిన చిరంజీవి.. ఇక రచ్చ రచ్చే?
ఇక, టాప్ సీరియల్స్ లో ఒకటిగా ఉండే గృహలక్ష్మి సీరియల్ పరిస్థతి మరీ దారుణంగా తయారైంది. ఇంకా చెప్పాలంటే ప్రసారం అయినప్పటి నుంచి ఇంత దారుణమైన రేటింగ్ ఎప్పుడూ కనిపించలేదు. రొటీన్ కథ, కథనంతో బుల్లి తెర ప్రేక్షకుల ఆదరణను గృహలక్ష్మి ధారవాహిక కోల్పోయింది. ఇంటికి దీపం ఇల్లాలు, జానకి కలగనలేదు, వంటలక్క, మధురానగరి కంటే అతి తక్కువ రేటింగ్ ను ఈ సీరియల్ దక్కించుకుంది. ఇక ఓవరాల్ గా కూడా టీఆర్పీ రేటింగ్స్ టాప్ 10లో స్టార్ మా హవా కొనసాగింది. టాప్ 10లో ఏకంగా ఏడు సీరియల్స్ స్టార్ మాకు చెందినవే కాగా.. మూడు జీ తెలుగు ఛానెల్లో వచ్చే సీరియల్స్ ఉన్నాయి. తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న బ్రహ్మముడి, నాగ పంచమి, కృష్ణా ముకుందా మురారి, త్రినయని, మల్లీ లాంటి సీరియల్స్ టాప్ 10లో ఉన్నాయి. మొత్తంగా చూస్తే తెలుగు సీరియల్స్ లో మరోసారి స్టార్ మా, జీ తెలుగు తమ పట్టు నిలుపుకున్నాయి. టాప్ 30లో రెండు సీరియల్స్ తప్ప మిగతావన్నీ ఈ రెండు ఛానెల్స్ కు చెందినవే ఉన్నాయి. ఈటీవీకి చెందిన రంగుల రాట్నం 21వ స్థానంలో, గువ్వా గోరింక 30వ స్థానాల్లో నిలిచాయి.