Dating App Scam: డేటింగ్ యాప్ మాయ.. లాయర్‌కు 5 కోట్లు కుచ్చుటోపి..!
- డేటింగ్ యాప్ ద్వారా పరిచయం..
- లాయర్‌ను బ్లాక్మెయిల్ చేసి 5 కోట్లు వసూలు
- ఆన్లైన్ డేటింగ్ యాప్‌లో మహిళగా నటిస్తూ ఓ కేటుగాడు మోసం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dating App Scam: హైదరాబాద్‌లో ఉన్న ఇజ్జత్‌నగర్‌కు చెందిన న్యాయవాదికి 2025 ఆగస్టులో ఒక ఆన్లైన్ డేటింగ్ యాప్ ద్వారా ‘దిశ’ అనే పేరుతో ఒక వ్యక్తి పరిచయమయ్యారు. తాను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగినని అవతలి వ్యక్తి చెప్పుకొచ్చారు. క్రమంగా వారి మధ్య నమ్మకం పెరగడంతో.. సైబర్ క్రైమ్ బాధితుడు వ్యక్తిగత విషయాలు, వివరాలను ఆమెతో పంచుకున్నారు. మొదటగా తన తండ్రి మరణించారని.. వారి అంత్యక్రియల ఖర్చుల కోసమంటూ ఆ వ్యక్తి బాధితుడి నుంచి 4.3 లక్షలు తీసుకున్నారు.
ఆ తర్వాత ఆ డబ్బును అడగగా తిరిగి ఇవ్వకపోవడంతో, బాధితుడు మరింత డబ్బు ఇవ్వడానికి నిరాకరించారు. దాంతో సదరు వ్యక్తి అసలు రూపం బయటపెట్టాడు. తాను ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తినని, తన అసలు పేరు ‘అలీనా’ అని చెప్పింది. అంతటితో ఆగకుండా, తమ మధ్య జరిగిన వ్యక్తిగత చాటింగ్‌లను బయటపెట్టి పరువు తీస్తానని, బాధితుడి ఇంటికి మనుషులను పంపుతానని బెదిరింపులకు దిగింది.
Also Read
- Azamgarh Encounter: భార్య, కుమారుడు, ఇద్దరు పూజారుల హత్య.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
- AI fraud: 65 ఏళ్ల మహిళ.. 29 ఏళ్ల డాక్టర్‌గా AI మోసం! వ్యాపారవేత్తకు భారీ టోకరా
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
దీంతో భయపడిపోయిన బాధితుడు వారి నంబర్‌ను బ్లాక్ చేశారు. కొంతకాలం తర్వాత.. జూలై 2026లో సదరు నిందితులు మళ్లీ బాధితుడిని సంప్రదించి.. తన తల్లి ఆసుపత్రిలో ఉందని చెప్పుకొచ్చింది. వ్యక్తిగత చాటింగ్‌లను కుటుంబ సభ్యులకు పంపుతానని, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని నిరంతరం బ్లాక్మెయిల్ చేస్తూ.. జూలై నుంచి సెప్టెంబర్ 15 మధ్య కోట్ల రూపాయలను వసూలు చేశారు.
సెప్టెంబర్ నెలలో గచ్చిబౌలి వద్ద నిందితులు పంపిన వ్యక్తులకు బాధితుడు ఏకంగా 77 లక్షల నగదును నేరుగా అందించారు. ఇలా తన వ్యక్తిగత పొదుపు, కుటుంబ పొదుపు మొత్తాలతో పాటు, ఒక ఫ్లాట్‌ను అమ్మగా వచ్చిన డబ్బును కూడా కలిపి మొత్తం రూ.5 కోట్లకు పైగా ఆ మోసగాళ్లకు ముట్టజెప్పారు. ఈ వేధింపులు మితిమీరిపోవడంతో బాధితుడు సెప్టెంబర్ 19న నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
తాజావార్తలు
-
IMEC: IMECతో ఇరాన్‌కు చెక్.. భారత కారిడార్‌కు ట్రంప్ మద్దతు..
-
BJP: స్మృతి ఇరానీకి మళ్లీ ప్రమోషన్.. యూపీ సహా పలు రాష్ట్రాలకు కొత్త ఇంఛార్జ్‌లు నియామకం
-
Flipkart BBD Sale: Samsung గెలాక్సీ ఎస్25పై రూ.20 వేల డిస్కౌంట్.. పూర్తి వివరాలివే..
-
Srikanth Odela: : నాని ‘జడల్’ లుక్ వెనుక ఉన్న అసలు వ్యక్తి ఎవరో తెలుసా?
-
DA Release : తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. రెండు డీఏలకు గ్రీన్ సిగ్నల్.!
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!