Srikanth Odela: : నాని ‘జడల్’ లుక్ వెనుక ఉన్న అసలు వ్యక్తి ఎవరో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ఊర మాస్ యాక్షన్ మూవీ ‘ది ప్యారడైజ్’ మరికొన్ని గంటల్లో థియేటర్లలో భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ఈ సినిమాలో అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షించిన అంశం నాని పవర్ ఫుల్ ‘జడల్’ లుక్. అసలు దర్శకుడికి ఈ వైల్డ్ ఐడియా ఎక్కడి నుంచి వచ్చిందబ్బా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. సరిగ్గా రిలీజ్ కు ముందు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ లుక్ వెనుక ఉన్న సంచలన రహస్యాన్ని బయటపెట్టి అందరికీ భారీ షాక్ ఇచ్చాడు. సోషల్ మీడియాలో శ్రీకాంత్ ఓదెల పంచుకున్న వివరాలు చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. సినిమాలో ‘జడల్’ పుట్టుక, అతడి పోరాటం అనేది కల్పిత కథే అయినప్పటికీ.. ఆ పాత్ర తాలూకు జడలు, ఆ గెటప్ మాత్రం తన చిన్నప్పటి రూపం నుంచి స్ఫూర్తి పొందినవేనని శ్రీకాంత్ అసలు గుట్టు విప్పాడు. సినిమాలో అనేక సన్నివేశాలు తాను పెరిగిన వాతావరణం, తన బాల్యం నుంచే ప్రభావితమయ్యాయని ఆయన వెల్లడించాడు. అంతేకాకుండా రెండు జడలు వేసుకుని ఉన్న తన చిన్ననాటి క్యూట్ ఫోటోను కూడా ఆయన అభిమానులతో పంచుకున్నాడు. తనకు ఐదారేళ్లు వచ్చే వరకు వాళ్ల అమ్మగారు అలా జుట్టు పెంచి, జడలు వేసేవారని ఆ పోస్ట్‌లో ఆయన ఎమోషనల్‌గా గుర్తుచేసుకున్నాడు.
పెద్దయ్యాక సినిమాల పట్ల ఆసక్తి పెంచుకున్న శ్రీకాంత్.. ఒక కమర్షియల్ సినిమా హీరో ఇలా జడలతో 70ఎంఎం (70MM) స్క్రీన్ మీద కనిపిస్తే ఎలా ఉంటుందని ఎప్పుడూ తనలో తాను ఊహించుకునే వాడినని తెలిపాడు. ఇప్పుడు అదే కలను నిజం చేస్తూ, తన హీరో ‘నాని అన్న’ను ఈ ‘జడల్’ గెటప్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నానని గర్వంగా ప్రకటించాడు. తాను షేర్ చేసిన ఫోటో కేవలం తన చిన్నతనం మాత్రమే కాదని, అదే తన ‘ప్యారడైజ్’ అని ఆయన ఎంతో భావోద్వేగంతో పేర్కొన్నాడు. మరికొన్ని గంటల్లో రాబోతున్న ‘ది ప్యారడైజ్’ సినిమా కోసం ప్రేక్షకులకు ఘన స్వాగతం పలుకుతూ శ్రీకాంత్ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట సెన్సేషన్‌గా మారింది. డైరెక్టర్ చిన్ననాటి రూపమే.. ఇప్పుడు నాని ఊర మాస్ లుక్‌గా మారిందన్న విషయం తెలియడంతో ఫ్యాన్స్ లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ ‘జడల్’ థియేటర్లలో సృష్టించే విధ్వంసాన్ని చూసేందుకు ఆడియన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
-
Aafiya Sayed : టాలీవుడ్లోకి బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఇంట్రడ్యూస్
-
Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!