Flipkart BBD Sale: Samsung గెలాక్సీ ఎస్25పై రూ.20 వేల డిస్కౌంట్.. పూర్తి వివరాలివే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ అక్టోబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ సాంసంగ్‌కు చెందిన ఫ్లాగ్షిప్ మోడల్ గెలాక్సీ ఎస్25 పై భారీ డిస్కౌంట్ లభించనుంది. మార్కెట్లోకి రూ.80,999 ప్రారంభ ధరతో వచ్చిన ఈ ఫోన్, ప్రస్తుతం రూ.69,999 ధరకు అందుబాటులో ఉంది. అయితే ఫ్లిప్‌కార్ట్ టీజర్ ప్రకారం.. బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో దీని బేస్ వేరియంట్ ధర రూ.60,000 కంటే తక్కువకే లభించనుంది. దీని ద్వారా కస్టమర్లకు రూ.20 వేల వరకు భారీ తగ్గింపు లభిస్తుందని స్పష్టమవుతోంది.
ఈ సేల్‌లో యాక్సెస్, ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ప్లస్, ప్రీమియం మెంబర్స్‌కు అక్టోబర్ 8 నుంచే ఎర్లీ యాక్సెస్ లభించనుంది.
Also Read
- Supreme Court: సీఈసీ నియామక చట్టంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. జడ్జిలు భిన్నాభిప్రాయాలు
- JSW Group: ఇక ఎలక్ట్రిక్ ట్రక్కుల వంతు.. 55 టన్నుల ట్రాక్టర్-ట్రైలర్‌తో ఎంట్రీ..
- KTR: కరెంట్ కోతలపై కేటీఆర్ ఫైర్.. ‘ఇది ఎల్ నినో కాదు.. ఎల్ కాంగ్రెస్’.!
- YS Jagan: అవినీతి ఏ స్థాయికి వెళ్లిందో చెప్పడానికి డీఎస్సీనే ఉదాహరణ!
గెలాక్సీ ఎస్25 స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. ఇందులో 6.2 అంగుళాల డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ డిస్ప్లే, 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. ఇది శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఫర్ గెలాక్సీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. కెమెరా పరంగా వెనుక వైపు 50ఎంపీ మెయిన్ కెమెరాతో పాటు 10ఎంపీ టెలిఫోటో, 12ఎంపీ అల్ట్రావైడ్ లెన్సులు ఉన్నాయి. సెల్ఫీల కోసం 12ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందించారు. అలాగే 4,000ఎంఏహెచ్ బ్యాటరీ, 25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఈ ఫోన్ ప్రత్యేకతలు. ఆండ్రాయిడ్ 15 ఆధారిత వన్ యూఐ 7 తో పనిచేసే ఈ ఫోన్‌కు 2032 వరకు సెక్యూరిటీ అప్డేట్లు లభిస్తాయని కంపెనీ తెలిపింది. తక్కువ ధరలో ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం.
తాజావార్తలు
-
Flipkart BBD Sale: Samsung గెలాక్సీ ఎస్25పై రూ.20 వేల డిస్కౌంట్.. పూర్తి వివరాలివే..
-
Srikanth Odela: : నాని ‘జడల్’ లుక్ వెనుక ఉన్న అసలు వ్యక్తి ఎవరో తెలుసా?
-
DA Release : తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. రెండు డీఏలకు గ్రీన్ సిగ్నల్.!
-
Nani : ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో సినిమా.. హుందాగా వెనక్కి తగ్గిన న్యాచురల్ స్టార్!
-
Supreme Court: సీఈసీ నియామక చట్టంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. జడ్జిలు భిన్నాభిప్రాయాలు
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!