Cyber Crime Recovery Mela: సైబర్ క్రైమ్ రికవరీ మేళా.. 310 మంది బాధితులకు రూ.6 కోట్ల రికవరీ చెక్కులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyber Crime Recovery Mela: విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్‌లో నిర్వహించిన సైబర్ క్రైమ్స్ రికవరీ మేళాలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సైబర్ మోసాలకు గురైన 310 మంది బాధితులకు సుమారు రూ.6 కోట్ల విలువైన రికవరీ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో విశాఖ పోలీస్ కమిషనర్ శంఖ బ్రత బాగ్చి, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.
సైబర్ నేరాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ, కోవిడ్ మహమ్మారి తర్వాత దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు గణనీయంగా పెరిగాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎన్డీయే ప్రభుత్వం సైబర్ నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. ఇక, సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రతి జిల్లాలో ప్రత్యేక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని హోంమంత్రి వెల్లడించారు. అలాగే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లకు అత్యాధునిక సాంకేతిక పరికరాలను అందజేస్తున్నామని చెప్పారు. సైబర్ నేరాల దర్యాప్తులో టెక్నాలజీని పూర్తిస్థాయిలో వినియోగిస్తున్నామని తెలిపారు.
Also Read
- Arms Theft: మద్రాస్ రెజిమెంట్‌లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
చదువుకున్నవారే ఎక్కువగా మోసపోతున్నారు
సైబర్ నేరాలకు బాగా చదువుకున్నవారు కూడా బలవుతున్నారని హోంమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇక, సైబర్ నేరాల నియంత్రణలో ప్రజల అప్రమత్తత కూడా కీలకమని హోంమంత్రి అన్నారు. ప్రభుత్వం సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపుతుందని, నేరస్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజల సహకారంతో సైబర్ నేరాలను సమర్థవంతంగా అరికట్టగలమని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఎక్స్‌ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!