CBSE స్టూడెంట్స్‌కు రిలీఫ్.. 10వ క్లాస్‌కు కొత్త రూల్ లేదు.!
- 2026-27 నుంచి కొత్త మూడు భాషల విధానం అమలు
- ప్రస్తుత 10వ తరగతి విద్యార్థులకు పూర్తి మినహాయింపు
- రెండు భారతీయ భాషలు తప్పనిసరి.. కొత్త నిబంధనలు
- ద్విభాషా బోధనతో భాషా అభ్యాసానికి ప్రాధాన్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు (CBSE) పాఠశాలల్లో మూడు భాషల విధానాన్ని (Three-Language Formula) అమలు చేయడంపై కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. జాతీయ విద్యా విధానం (NEP-2020) సిఫార్సుల ప్రకారం భాషా అభ్యాసాన్ని మరింత అర్థవంతంగా, ఆసక్తికరంగా, విద్యార్థుల సమగ్ర వికాసానికి దోహదపడేలా రూపొందించనున్నట్లు సీబీఎస్ఈ స్పష్టం చేసింది. ఈ కొత్త మార్గదర్శకాలు 2026-27 విద్యా సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలల్లో అమల్లోకి రానున్నాయి. అయితే, ప్రస్తుతం చదువుతున్న పలు తరగతుల విద్యార్థులకు బోర్డు పరీక్షల విషయంలో సీబీఎస్ఈ పెద్ద ఊరటనిచ్చింది.
ప్రస్తుత 10వ తరగతి విద్యార్థులకు మినహాయింపు
సీబీఎస్ఈ తీసుకొచ్చిన ఈ కొత్త మూడు భాషల విధానం ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వర్తించదని బోర్డు స్పష్టం చేసింది. అలాగే, ప్రస్తుతం 7, 8, 9 తరగతుల్లో చదువుతున్న విద్యార్థులు భవిష్యత్తులో 10వ తరగతికి వెళ్లినప్పుడు కూడా ఈ మూడో భాషలో ప్రత్యేకంగా బోర్డు పరీక్ష రాయాల్సిన అవసరం లేదు. దీనివల్ల ప్రస్తుత హైస్కూల్ విద్యార్థులపై ఎలాంటి అదనపు పరీక్షల భారం పడబోదు.
Also Read
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
రెండు భారతీయ భాషలు తప్పనిసరి.. ద్విభాషా బోధన
జాతీయ విద్యా విధానం (NEP-2020) ప్రకారం విద్యార్థులు నేర్చుకునే మూడు భాషల్లో కనీసం రెండు అధికారిక భారతీయ భాషలు ఉండటం తప్పనిసరి. ఈ నేపథ్యంలో, ప్రస్తుతం 7, 8, 9 తరగతుల్లో రెండో భాషగా రెండు భారతీయ భాషలను చదువుతున్న విద్యార్థులు, ఇకపై వాటితో పాటు ఒక అదనపు భారతీయ భాషను కూడా కొనసాగించాల్సి ఉంటుంది. విద్యార్థులు సరికొత్త భాషలను సులభంగా నేర్చుకునేందుకు వీలుగా, వారి తరగతి స్థాయికి అనుగుణంగా బోధనా సామగ్రిని ద్విభాషా (బైలింగ్వల్) రూపంలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు బోర్డు వెల్లడించింది. సంస్కృతిని, భాషా నైపుణ్యాలను పెంపొందించేలా ఈ మార్పులు ఉండబోతున్నాయి.
తాజావార్తలు
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!