India's Biggest Digital Arrest Scam: గత కొన్ని ఏళ్లుగా దేశవ్యాప్తంగా అనేక డిజిటల్ అరెస్టు కేసులు వెలుగులోకి వచ్చాయి. కానీ తాజాగా భారతదేశంలోనే అతిపెద్ద డిజిటల్ అరెస్ట్ కేసు ఢిల్లీలో వెలుగు చూసింది. ఈ కేసు పోలీసులను, దర్యాప్తు సంస్థలను కూడా ఆశ్చర్యపరిచింది. దక్షిణ ఢిల్లీలోని గుల్మోహర్ పార్క్‌లో నివసించే రిటైర్డ్ బ్యాంకర్ నరేష్ మల్హోత్రా దీనికి బలయ్యాడు. ఈ వృద్ధుడిని ఏకంగా నెలకు పైగా అరెస్టు చేశారు. అతడు జీవితాంతం పొదుపు చేసిన 23…
లోన్ యాప్ మోసాలు ప్రస్తుతం తగ్గాయని తెలంగాణ సీఐడీ డీజీ షికా గోయల్ వెల్లడించారు. లోన్ యాప్‌లు తక్కువ సంఖ్యలో యాక్టివ్‌గా ఉన్నాయని తెలిపారు. డిజిటల్ అరెస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఆమె సూచించారు. పోలీస్ అధికారులు అంటూ ఎవరు కాల్ చేసినా కాల్ కట్ చేయాలన్నారు.
సైబర్ నేరాల నివారణ కోసం సైబరాబాద్ పోలీసులు P.R.O.T.E.C.T పేరుతో సరికొత్త ప్రాజెక్ట్‌ను తీసుకొచ్చారు. సైబరాబాద్ పోలీస్ రూపొందించిన P.R.O.T.E.C.T(ప్రొటెక్ట్) అనే ప్రాజెక్ట్‌ను సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి, మాదాపూర్ డీసీపీ వినీత్‌లు లాంచనంగా ప్రారంభించారు. ఆన్‌లైన్ డిజిటల్ ప్రపంచంలో పౌరులకు అవగాహన కల్పించడం, ప్రమాదాలు నివారించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ పని చేయనుంది.