Naveen Case: సమాజంలో ప్రేమ అనే పేరుతో జరిగే దారుణాలు అన్ని ఇన్ని కావు. ముఖ్యంగా ప్రేమ అనే పేరును అడ్డుపెట్టుకొని పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తూ తమది నిజమైన ప్రేమ అంటూ చెప్పుకొస్తున్నారు కొంతమంది. ఆ మైకంలో చేయరాని తప్పులు చేసి చిన్న వయసులోనే జైలు పాలు అవుతున్నారు. అందుకు నిదర్శనమే హరిహరి కృష్ణ. ప్రేమించిన అమ్మాయితో చనువుగా ఉంటున్నాడని ప్రాణ స్నేహితుడు అని కూడా చూడకుండా అతి కిరాతకంగా చంపేశాడు. అనంతరం గుండెను తీసి ప్రియురాలికి వాట్సప్ చేశాడు. ఆమె సైతం ఇందులో తప్పేమి లేనట్లు వెరీ గుడ్ అని రిప్లై ఇవ్వడం.. ఈ సమాజంలో ఎలాంటి వారు ఉన్నారు అనేది ప్రజలకు తెలిసేలా చేసింది. 20 ఏళ్ల వయసులో హరిహర కృష్ణ చేసిన అతి క్రూరమైన పనికి.. నవీన్ కుటుంబం నరకం అనుభవిస్తోంది. చేతికి అందివచ్చిన కొడుకు.. చదువుకొని తమని ఉద్ధరిస్తాడు అనుకొంటే.. ఇలా ముక్కలైన శరీరంతో కనిపించేసరికి ఆ తండ్రి విలవిల లాడిపోయాడు. ఇంత క్రూరంగా నవీన్ ను చంపినా తన కసి తీరలేదని హరిహర కృష్ణ చెప్పడం గమనార్హం.
Leela Pavitra: నడిరోడ్డుపై పవిత్ర దారుణ హత్య.. అక్కడ 16 సార్లు కసితీరా పొడిచి
ఇక తాజాగా హరిని విచారించిన పోలీసులకు నమ్మలేని నిజాలు తెలిశాయి. అప్పటికప్పుడు జరిగిన హత్య కాదని, అతడిని చంపడానికి మూడు నెలలు హరి రెక్కీ నిర్వహించినట్లు తెలిసి నిర్ఘాంత పోయారు. అంతేకాకుండా హత్య చేసినా పశ్చాతాపం లేకుండా హరి చెప్పే మాటలకు పోలీసులు సైతం షాక్ అవుతున్నారు. చంపేశావ్ కదా.. ఆ వేళ్లు ఎందుకు కట్ చేశావ్ అని అడుగగా.. విక్రమ్ సినిమాలో విలన్ ఫ్రెండ్ వేళ్లు కోసి చంపేయడం ఎంతో నచ్చిందని, ఆ సీన్ కు ఇన్స్పైర్ అయ్యి.. తాను కూడా వెళ్లు కోసేసా అని బదులిచ్చాడట. ఆ సినిమా డైరెక్టర్ అంటే తనకు ఎంతో ఇష్టమని, విక్రమ్ సినిమాను చాలా సార్లు చూసినట్లు చెప్పుకొచ్చాడట. ఆ ఒక్కటే కాకుండా వేళ్లు ఉంటే ఆధార్ తో మ్యాచ్ చేసి పోలీసులు గుర్తు పట్టేస్తారని, అందుకే వాటిని కోసేసినట్లు తెలిపాడు. ఇక ఈ విషయం వినడంతో పోలీసులు సైతం దేవుడా.. ఇంత క్రూరుడు అని షాక్ అవుతున్నారట.ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.