Site icon NTV Telugu

Crime News: ఆయనకు 67.. ఆమెకు 58.. మహిళపై లైంగిక దాడి!

Biharrape

Biharrape

Crime News: మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ నగరంలో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. రిచాయ్ ప్రాంతానికి చెందిన 58 ఏళ్ల మహిళ తనకు పరిచయమైన వ్యక్తి తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుపై స్పందించిన రాంఝి పోలీస్ స్టేషన్ అధికారులు 67 ఏళ్ల మహేష్ చక్రవర్తిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు అతడిని జైలుకు తరలించారు.

Off The Record: అధికార పార్టీలో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు.. మున్సిపల్ ఎన్నికల వేళ ‘హస్తం’లో హడల్!

పోలీసుల వివరాల ప్రకారం.. నిందితుడు బాధితురాలి భర్తకు సన్నిహిత స్నేహితుడు. గతంలో ఇద్దరూ ఒక ప్రభుత్వ కార్యాలయంలో కలిసి పనిచేసినట్లు తెలుస్తోంది. ఈ పరిచయాన్ని ఆసరాగా చేసుకుని ఒక సంవత్సరం క్రితం ప్రసాదం ఇవ్వడానికి తన ఇంటికి వచ్చిన మహిళపై నిందితుడు బలవంతంగా దాడి చేశాడని బాధితురాలు ఆరోపించింది. ఆమె ప్రతిఘటించగా చంపేస్తానని, పరువు తీస్తానని బెదిరిస్తూ ఎవరికీ చెప్పకుండా ఉండేలా ఒత్తిడి చేసినట్లు తెలిపింది.

Pakistan: ఆపరేషన్ సిందూర్‌ను ‘‘ఘజ్వా-ఎ-హింద్’’‌గా అభివర్ణించిన పాక్ చీఫ్..

ఈ ఘటన తర్వాత కూడా ఆమె ఒంటరిగా ఉన్న సందర్భాల్లో బెదిరింపులు కొనసాగిస్తూ దాడికి పాల్పడినట్లు బాధితురాలు పేర్కొంది. చివరకు సెప్టెంబర్ 2025లో ఈ విషయాన్ని తన భర్తకు తెలిపింది. అనంతరం ఇద్దరూ కలిసి రాంఝి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేసి కొన్ని గంటల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు విషయం బయటకు చెబితే సామాజికంగా, కుటుంబపరంగా అవమానానికి గురిచేస్తానని నిందితుడు పదే పదే బెదిరించినట్లు రాంఝి పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి ఉమేష్ గోల్హాని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Exit mobile version