Rahul Gandhi: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘‘ఉన్నావ్ అత్యాచారం’’ కేసులో దోషిగా తేలిన మాజీ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు ఢిల్లీ హైకోర్టు ఉపశమనం ఇచ్చింది. సెంగార్ ఈ కేసులో తనపై వచ్చిన ఆరోపణల్ని, జైలు శిక్షను సవాల్ చేశాడు. హైకోర్టు సెంగార్ శిక్షను నిలిపివేస్తూ బెయిల్ మంజూరు చేసింది. ఆయన ఇప్పటికే 7 ఏళ్ల 5 నెలల జైలు శిక్ష పూర్తి చేయడంతో న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.
Chain Snatching: చైన్ స్నాచింగ్ గ్యాంగుల బెడద ఎక్కువైంది. బైక్ మీద వెళ్తూనే మహిళల మెడల్లో బంగారు గొలుసులు ఎత్తుకెళ్తున్నారు. కానీ ఈ మధ్య కారులో కూడా చైన్ స్నాచర్లు వస్తున్నారని వెల్లడైంది. అలా వచ్చిన కర్ణాటక గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీ మెడలో చైన్ కొట్టేశారు స్నాచర్లు.
ఓ మహిళా యూట్యూబర్ రైలులో ఒంటరిగా ప్రయాణించింది. ఓ వ్యక్తి తన కోచ్‌లోకి వచ్చి మత్తుమందు స్ప్రే చేశాడని తెలిపింది. అనంతరం తనతో పాటు చాలా మంది వస్తువులు దోచుకున్నాడని ఆరోపించింది. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేసింది. ఈ వీడియో చూసిన రైల్వే ప్రయాణికులకు భద్రత పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.