Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Crime Stories Chilakalaguda Btech Student Murder Hyderabad Love Affair

Tragedy : చిలకలగూడలో దారుణం.. బీటెక్ విద్యార్థిని వెంటాడి, కత్తులతో పొడిచి దారుణ హత్య.!

Published Date :May 8, 2026 , 9:18 am
By Gogikar Sai Krishna
  • ప్రేమ వ్యవహారం.. ప్రాణాలు తీసిన పగ
  • ఏడుగురు యువకులతో దాడి.. కత్తులతో వెంటాడి హత్య
  • తల, మెడపై 15 కత్తిపోట్లు.. అక్కడికక్కడే మృతి
  • నిందితుల కోసం మూడు ప్రత్యేక బృందాలతో గాలింపు
Tragedy : చిలకలగూడలో దారుణం.. బీటెక్ విద్యార్థిని వెంటాడి, కత్తులతో పొడిచి దారుణ హత్య.!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Tragedy : సికింద్రాబాద్‌లోని చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది. ప్రేమ వ్యవహారమే ప్రధాన కారణంగా ఒక యువకుడిని ప్రత్యర్థులు విచక్షణారహితంగా కత్తులతో పొడిచి ప్రాణాలు తీశారు. ఇందిరానగర్ కాలనీలో గురువారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. అల్వాల్‌లోని యాప్రాల్‌కు చెందిన యువన్ అలియాస్ అఖిల్ (21), మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. యువన్ గతంలో చిలకలగూడలోని ఇందిరానగర్‌లో నివసించేవాడు. అక్కడే ఒక యువతితో గత ఐదేళ్లుగా అతడికి ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ప్రస్తుతం యాప్రాల్‌లో ఉంటున్నప్పటికీ, తరచూ ఆ యువతిని కలిసేందుకు యువన్ చిలకలగూడకు వస్తుండేవాడు.

గురువారం రాత్రి 9 గంటల సమయంలో యువన్ తన మిత్రులతో కలిసి ఇందిరానగర్‌లో మొబైల్ ఫోన్‌లో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాడు. ఆ సమయంలో రెండు ద్విచక్ర వాహనాలపై సుమారు ఏడుగురు యువకులు అక్కడికి చేరుకున్నారు. వారు యువన్‌తో గొడవకు దిగి, ఒక్కసారిగా వెంట తెచ్చుకున్న కత్తులతో అతడిపై విచక్షణారహితంగా దాడి చేశారు.

Also Read

  • Tragedy: తీవ్ర విషాదం.. ముగ్గురి ప్రాణాలు తీసిన ఈత సరదా.
  • Suvendu Adhikari PA: సువేందు అధికారి పీఏ దారుణ హత్య.. కాల్చి చంపిన దుండగులు
  • Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి స్కెచ్ అమలు.. చివరికిలా..!
  • Viral: నైట్ కు వస్తావా..? రేట్ ఎంత..? అర్ధరాత్రి బస్టాండ్ వద్ద సీపీతో బేరం ఆడిన పోకిరీలు.
Add as a preferred
source on google

నిందితులు యువన్‌ను వెంటాడి మరీ దాడికి పాల్పడ్డారు. తల, మెడ, చేతులపై సుమారు 15 చోట్ల కత్తులతో పొడవడంతో యువన్ రక్తపు మడుగులో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. నిందితుల్లో సదరు యువతి సోదరులు , వారి స్నేహితులు ఉన్నట్లు సమాచారం. తమ సోదరితో యువన్ ప్రేమలో ఉండటం ఇష్టం లేని వారు, పక్కా పథకం ప్రకారమే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.

సమాచారం అందుకున్న చిలకలగూడ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. యువన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈ హత్యకు పాల్పడిన నిందితులను పట్టుకునేందుకు పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.  జనం రద్దీగా ఉండే ప్రాంతంలో యువకుడిని ఇంత దారుణంగా హత్య చేయడంపై స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BTech Student Murder
  • Chilakalaguda Murder
  • Crime News
  • hyderabad crime
  • love affair murder

తాజావార్తలు

  • Lavanya Tripathi: చిరంజీవిపై లావణ్య త్రిపాఠి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

  • OnePlus Nord CE 6 Lite: వన్‌ప్లస్ నార్డ్ CE6 లైట్ రిలీజ్.. 7000mAh బ్యాటరీ, 50MP కెమెరా, ధర సేల్ డేట్ పూర్తి సమాచారం

  • PEDDI : కేవలం 4 గంటల్లో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన పెద్ది

  • IPL 2026 Final: చిన్నస్వామి నుంచి ఐపీఎల్‌ ఫైనల్‌ తరలింపు.. షాకింగ్ విషయం చెప్పిన బీసీసీఐ!

  • New Bat Coronavirus: థాయ్‌లాండ్‌లో కొత్త కరోనావైరస్.. శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే?

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions