Chain Snatching: చైన్ స్నాచింగ్ గ్యాంగుల బెడద ఎక్కువైంది. బైక్ మీద వెళ్తూనే మహిళల మెడల్లో బంగారు గొలుసులు ఎత్తుకెళ్తున్నారు. కానీ ఈ మధ్య కారులో కూడా చైన్ స్నాచర్లు వస్తున్నారని వెల్లడైంది. అలా వచ్చిన కర్ణాటక గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీ మెడలో చైన్ కొట్టేశారు స్నాచర్లు. ఇటీవల హైదరాబాద్‌లో ఇలాంటి ఘటనలే రికార్డయిన పరిస్థితి. ఇక్కడ చూడండి.. ఈ ఫోటోల్లో ఉన్న మహమ్మద్ నస్రత్ అలీ, ఇర్షద్ అహ్మద్ హైదరాబాద్ లో చైన్ స్నాచింగ్‌లు చేస్తున్నారు. కర్ణాటకలోని బీదర్ నుంచి హైదరాబాద్ లో చోరీలు చేస్తున్నారు. వీరు ఓ మహిళ దగ్గర అడ్రస్ అడుగుతున్నట్లుగా నటించి చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డారు. ఆ సమయంలో సీసీ ఫుటేజీలో దొంగతనం దృశ్యాలు రికార్డయ్యాయి. వాటి ఆధారంగా కేసు ఛేదించిన పోలీసులు వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
READ MORE: Triple Murder: వీడిన ట్రిపుల్ మర్డర్ మిస్టరీ.. మూడు ప్రాణాలు బలిగొన్న వివాహేతర సంబంధం..!
మరోవైపు ఢిల్లీలో ఓ కాంగ్రెస్‌కు చెందిన మహిళా ఎంపీ మెడలో చైన్ లాక్కుని వెళ్లారు దుండగులు. తమిళనాడులోని మయిలాడుతురై ఎంపీగా ఉన్న సుధా రామకృష్ణన్ మెడలో బంగారు గొలుసు లాక్కెళ్లారు స్నాచర్స్. విదేశీ రాయబార కార్యాలయాలు ఉన్న అత్యధిక భద్రతా ప్రాంతం సమీపంలోనే ఈ చైన్ స్నాచింగ్ జరిగింది. దీనిపై ఢిల్లీ పోలీసులు విచారణ చేపట్టారు.. చైన్ స్నాచింగ్‌లు పెరుగుతున్న నేపథ్యంలో మహిళలు బయటకు వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు..