Ganja Gang Attack: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురం ప్రాంతంలో గంజాయి బ్యాచ్ ఆగడాలు అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోతున్నాయి. వనస్థలిపురం పరిధిలోని జెమ్ కిడ్నీ హాస్పిటల్ ముందు చోటుచేసుకున్న ఒక దారుణ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. గురువారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో ఆరుగురు యువకులు హాస్పిటల్ ముందు మద్యం తాగుతూ న్యూసెన్స్ సృష్టించారు. హాస్పిటల్ ముందు మద్యం సేవించవద్దని హాస్పిటల్ సిబ్బంది అభ్యర్థించడంతో, ఆ యువకులు వారిపై దాడికి పాల్పడ్డారు.…
R.S. Brothers : ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఫ్యాషన్, షాపింగ్ ప్రేమికులకు తెలిసిన ప్రముఖ బ్రాండ్ R.S. Brothers తమ 15వ షోరూమ్‌ను సెప్టెంబర్ 26న హైదరాబాద్ వనస్థలిపురం, బొమ్మిడి ఎలైట్ టవర్స్ సమీపంలో శుభారంభం చేసింది. కుటుంబసమేత షాపింగ్ కోసం ప్రత్యేకంగా రూపకల్పన చేసిన ఈ షోరూమ్ విస్తృత శ్రేణి వస్త్రాలు, ఫ్యాన్సీ, వెడ్డింగ్ కలెక్షన్లతో ఆకట్టుకుంటోంది. షోరూమ్ ప్రారంభోత్సవానికి ప్రముఖ సినిమా జంట అక్కినేని నాగచైతన్య మరియు శోభిత ధూళిపాల ప్రారంభించారు. నాగచైతన్య షోరూమ్…
ACB: వనస్థలిపురం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్ తెలిపిన వివరాల ప్రకారం– తుర్కయాంజల్‌కు చెందిన ఓ వ్యక్తి తనకు ఉన్న 200 గజాల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు సబ్‌రిజిస్ట్రార్ రాజేశ్‌ను సంప్రదించాడు. ఈ సందర్భంగా ప్లాటు రిజిస్ట్రేషన్ కోసం రాజేశ్ రూ.1 లక్ష లంచం డిమాండ్ చేశాడు. తర్వాత చర్చల అనంతరం రూ.70 వేల వద్ద ఒప్పందం కుదిరింది. దీంతో ఆ స్థల యజమాని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు…
హైదరాబాద్ లోని వనస్థలిపురంలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. ఒకే కుటుంబంలో 8మందికి ఫుడ్ పాయిజన్ అయ్యింది. ఎల్బీనగర్ చింతలకుంటలో ఘటన చోటుచేసుకుంది. ఓ కుటుంబం బోనాల పండుగ రోజు తెచ్చుకున్న మటన్ ను వండి ఫ్రిజ్లో పెట్టుకుంది. ఫ్రిజ్లో లో నిల్వ చేసిన మటన్ ని ఈ రోజు తిరిగి తినడంతో ఫుడ్ పాయిజన్ కు గురైనట్లు సమాచారం. ఫుడ్ పాయిజన్ కావడంతో ఆర్టీసీ ఉద్యోగి శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా ఏడుగురు…
Telangana Rains: హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరైన రాష్ట్ర ప్రజలకు ఉపశమనం లభించింది. రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నారు.
తెలంగాణ పాలకులను టెర్రరిస్టులు అంటూ.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య విధ్వేషాలు రగిల్చేలా మాట్లాడిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి. వనస్థలిపురం ఏసీపీకి ఫిర్యాదును అందజేశారు.
ఇటీవల మాజీ సీఐ నాగేశ్వరరావు ఉదంతం మరవక ముందే మరో ఇన్‌స్పెక్టర్ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. వనస్థలిపురంలో ఇన్‌స్పెక్టర్ గా పని చేస్తున్న రాజు అక్రమ సంబంధాన్ని భార్య గుట్టు రట్టు చేసింది. తనకు న్యాయం చేయాలంటూ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ ఎదుట పిల్లలతో కలిసి ఆందోళనకు దిగింది.
ఓ సీఐపై అత్యాచారం కేసు నమోదు చేశారు వనస్థలిపురం పోలీసులు. తన భర్తపై దాడి చేసి.. తనను కిడ్నాప్ చేసి ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మారేడ్‌పల్లి సీఐపై వనస్థలిపురం పీఎస్‌లో కేసు నమోదు చేశారు.. బాధిత మహిళ భర్తపై దాడికి పాల్పడిన సీఐ.. ఆ తర్వాత నగర శివారులోని ఓ లాడ్జికి బలవంతంగా ఆ మహిళను తీసుకెళ్లాడు.. ఆపై అమెపై అఘాయిత్యానికి పాల్పడినట్టు తన ఫిర్యాదులో పేర్కొంది బాధితురాలు.. ఇక,…
హైదరాబాద్ వనస్థలిపురం బ్యాంక్ ఆఫ్ బరోడాలో నగదు మాయం ఘటన కొత్త మలుపు తిరిగింది. సాహెబ్‌నగర్ బ్రాంచీలో క్యాషియర్ రూ. 22 లక్షల 53వేల 378 లక్షల నగదుతో పరారైనట్లు… బ్యాంకు అధికారులు మంగళవారం.. పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తనపై వచ్చిన ఆరోపణలపై సెల్ఫీ వీడియో ద్వారా క్యాషియర్ ప్రవీణ్ వివరణ ఇచ్చాడు. హైదరాబాద్ వనస్థలిపురం బ్యాంక్ ఆఫ్ బరోడాలో నగదు మాయం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న క్యాషియర్ ప్రవీణ్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.…
హైదరాబాద్ లో రోజు రోజుకి వంద FIRలు నమోదు అవుతుంటే.. అందులో 20 సైబర్ క్రైమ్ కేసులే ఉంటున్నాయి. ఇక వనస్థలిపురం బ్యాంక్ లో క్యాషియర్ చోరీ కేసులో కొత్త కోణం చవి చూసింది. క్రికేట్ బెట్టింగ్ వ్యవహారమే చోరీకి కారణమని తేలింది. బెట్టింగ్ లో నష్టపోయి చోరీచేసానని మేనేజర్ కు, సహ ఉద్యోగులకు క్యాషియర్ ప్రవీణ్ మెస్సేజ్ లు పెట్టాడు. బెట్టింగ్ లో డబ్బులు వస్తే తిరిగి ఇస్తాను.. లేదంటే సూసైడ్ చేసుకుంటానని తెలిపాడు. దీంతో…