BMW Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 230 KMPH వేగంతో లారీని ఢీకొట్టిన కారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BMW Accident That Killed Four In Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గంటకు 230 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న బీఎండబ్ల్యూ కారు.. ఓ కంటైనర్ ట్రక్కును ఢీకొట్టింది. అతివేగంతో ఢీ కొట్టడంతో.. కారు మొత్తం తునాతునకలైంది. దీంతో.. అందులో ఉన్న నలుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌లో గత శుక్రవారం ఈ ప్రమాదం జరిగింది. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో వెళ్లాలన్న ఉద్దేశంతో.. వేగం పెంచాల్సిందిగా డ్రైవింగ్ సీట్‌లో కూర్చున్న తమ స్నేహితుడ్ని పక్కన కూర్చున్న వ్యక్తి ఒత్తిడి తెచ్చాడు. దీంతో అతడు క్రమంగా వేగం పెంచుకుంటూ పోయాడు. 230 కీలోమీటర్ల వేగానికి బండి వచ్చినప్పుడు.. అదుపు తప్పింది.
ఈ ప్రమాదం సంభవించడానికి ముందు.. కారులో నలుగురు వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణకు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తొలుత సాధారణ వేగంలోనే డ్రైవింగ్ సీట్‌లో కూర్చున్న వ్యక్తి కారు నడుపుతుండగా.. పక్క సీట్‌లో ఉన్న స్నేహితుడు ‘‘మనం లైవ్‌లో ఉన్నాం. 300 కిలోమీటర్ల వేగంతో డ్రైవ్ చేయు’’ అని అన్నాడు. మరీ అంత వేగంతో వెళ్తే, మనమంతా చనిపోతామని మరో వ్యక్తి చెప్పగా.. మీరంతా సైలెంట్‌గా ఉంటే నేను డ్రైవ్ చేయగలనంటూ డ్రైవింగ్ సీట్‌లో కూర్చున్న వ్యక్తి పేర్కొన్నాడు. ఒక దశలో కారు వేగాన్ని తగ్గించగా.. వీడియో తీస్తున్న వ్యక్తి ‘‘ఎందుకు వేగం తగ్గిస్తున్నావ్? మనం మళ్లీ పిక్‌అప్ అవ్వలేము, ఇదిగో ఇప్పుడు దారి మొత్తం ఖాళీగా ఉంది, త్వరగా వేగం పెంచు’’ అంటూ రెచ్చగొట్టాడు. దీంతో.. డ్రైవ్ చేస్తున్న వ్యక్తి చెలరేగిపోయి, 300 కిలోమీటర్ల వేగాన్ని అందుకునేందుకు ప్రయత్నించాడు.
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
కానీ.. 230 కిలోమీటర్ల వేగానికి చేరుకున్నప్పుడు, బీఎండబ్ల్యూ కారు అదుపు తప్పింది. కంటైనర్ ట్రక్కును ఢీకొట్టగానే.. కారు ఇంజిన్ పేలిపోయింది. అందులో కూర్చున్న వ్యక్తులు కొన్ని మీటర్ల దూరంగా ఎగిరిపడి, అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఒకరు డాక్టర్, మరొకరు ఇంజినీర్ కాగా.. మరో ఇద్దరు వ్యాపారులు తేలింది. అయితే.. ఘటన సమయంలో వాళ్లు మద్యం సేవించారా? లేదా? అనేది స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు.. ఘటన తర్వాత కంటైనర్ ట్రక్ డ్రైవర్ పారిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Pakistan: పాకిస్థాన్‌ను 15 ‘ముక్కలు’ చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
-
MS Dhoni: రెండో టీ20 మ్యాచ్‌కు ఎంఎస్ ధోనీ.. ఆ స్టార్ ఓపెనర్ కోసమేనా?.. వైభవ్ కోసం కాదండోయ్!
-
Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
-
GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
-
Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!