Man Kills Wives: బిహార్‌లో దారుణం చోటుచేసుకుంది.. దర్భాంగా జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ముగ్గురు మహిళలను పెళ్లి చేసుకొని వారిలో ఇద్దరిని హత్య చేసి చంపేశాడు. వీరిలో ఇంకోకరు ఎలా బతికి ఉన్నారు అని అనుకుంటున్నారా.. ఆమె కొంచెం ముందే ప్రమాదాన్ని పసిగట్టి అతడిని విడిచిపెట్టి వెళ్లిపోయి ప్రాణాలతో బతికి ఉంది. సదరు వ్యక్తి మొదటిసారి పెళ్లి చేసుకున్నప్పుడు ఆయనను తన భార్య విడిచిపెట్టి వెళ్లిపోయింది. దీంతో రెండో పెళ్లి చేసుకున్నాడు. చేసుకున్నోడు మంచిగా ఉండాలా.. అబ్బే అనుకుంటూ ఆమెను చంపి జైలుకు వెళ్లాడు. ఏదో కిందా మీద పడి బెయిల్ సంపాదించి జైలు నుంచి విడుదలయ్యాక.. ఇక పెళ్లి లేదు.. భార్యా లేదనుకోకుండా మనోడు మూడో పెళ్లికి సిద్దమయ్యాడు. అయితే అయ్యిండు.. చేసుకున్న భార్యను సంతోషంగా చూసుకోలేక పోయినా.. కనీసం ప్రాణాలతో బతికిస్తే బాగుండేది. పాపం ఆమెను కూడా ఖతం చేసి తప్పించుకొని పోయిండు. ఈ కథంతా ఎప్పుడు జరిగిందనే ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Nara Rohith : శిరీషతో పెళ్లి ఎప్పుడో చెప్పేసిన నారా రోహిత్
రాణిపూర్‌బేలాలో హత్య..
దర్భంగాలోని సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాణిపూర్ బేలా గ్రామానికి చెందిన ప్రమోద్ పాస్వాన్ అనే వ్యక్తి ఆగస్టు 26 రాత్రి నిద్రిస్తున్న తన భార్య విభపై పదునైన ఇనుప వస్తువుతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను అక్కడే వదిలేసి, దాడి చేసిన వస్తువుతో అక్కడి నుండి పారిపోయాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆమెను దర్భాంగా మెడికల్ కాలేజీ హాస్పిటల్ (DMCH)లో చేర్చారు. పరిస్థితి విషమించడంతో వైద్యులు పాట్నాకు రిఫర్ చేశారు. పాట్నాలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం విభ మరణించింది. ఈసందర్భంగా సదర్ పోలీస్ స్టేషన్‌లో మృతురాలి తండ్రి ప్రమోద్ పాశ్వాన్‌పై ఫిర్యాదు చేశాడు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పెళ్లైన కొద్ది రోజులకే ప్రమోద్ తన కూతురిపై కట్నం కోసం దాడి చేసేవాడని కన్నీటిపర్యంతం అయ్యాడు. వెంటనే నిందితుడి పట్టుకొని కఠినంగా శిక్షించాలని కోరాడు.
కేసు నమోదు చేసిన పోలీసులకు దర్యాప్తులో ప్రమోద్ పాశ్వాన్‌కు చాలా కాలంగా నేర చరిత్ర ఉందని తెలిసింది. ఈసందర్భంగా పలువురు పోలీసు అధికారులు మాట్లాడుతూ.. అతని చిత్రహింసలు భరించలేక మొదటి భార్య ఇల్లు వదిలి వెళ్లిపోయిందని, 2019లో అతను రెండవ వివాహం చేసుకున్నట్లు తెలిపారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఆయన తన రెండవ భార్యను గొంతు కోసి చంపి, జైలుకు వెళ్లాడని పేర్కొన్నారు. ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత, మూడవ వివాహం చేసుకున్నాడని, ఇప్పుడు ఏడాదిలోనే మూడో భార్యను కూడా హత్య చేశాడని చెప్పారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన జరిగినప్పటి నుంచి గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది.