Crime: దారుణం.. అక్కాచెల్లెళ్లపై అత్యాచారం.. ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి..
- మధ్యప్రదేశ్‌లో దారుణం..
- అక్కాచెల్లెళ్లపై అత్యాచారం..
- వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్..
- ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో దారుణం జరిగింది. అక్కాచెల్లెళ్లు అయిన ఇద్దరు ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. అత్యాచారానికి సంబంధించిన వీడియోలు తీసి, ఇద్దర్ని బ్లాక్‌మెయిల్ చేశారు. దీనిపై బాధితుల్లో ఒక మహిళ నిందితుడు ఫర్హాన్ అనే వ్యక్తిపై ఫిర్యాదు చేయడంతో, అతడిని అతడి స్నేహితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫర్హాన్‌తో పాటు అతడి స్నేహితుడు తనపై, తన సోదరిపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపించింది.
Read Also: Putin: ‘‘షరతులు లేకుండా చర్చలకు సిద్ధం’’.. ఉక్రెయిన్‌కి పుతిన్ సందేశం..
Also Read
- Meerut Murder Case: భర్తను చంపి పాముకాటు డ్రామా.. భార్య, ఆమె లవర్‌కు ‘‘ఉరిశిక్ష’’..
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
2022లో కాలేజీలో చదువుతున్న సమయంలో ఫర్హాన్‌తో స్నేహం చేశానని మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. ఒక రోజు ఫర్హాన్ తనను జహంగీరాబాద్‌లోని తన స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లాడని, అక్కడ ఇద్దరం శృంగారంలో పాల్గొన్నట్లు చెప్పింది. దీనిని అతను రికార్డ్ చేసినట్లు చెప్పింది. ఆ తర్వాత ఈ వీడియోని ఉపయోగించి తనను బెదిరించాడని, ఇస్లాం మతంలోకి మారి వారి ఆచారాలను పాటించకపోతే వీడియోని వైరల్ చేస్తానని బెదిరించాడని ఫిర్యాదులో చెప్పింది.
ఫర్హాన్, అతడి స్నేహితుడు బెదిరించిన రికార్డింగులను పోలీసులకు ఆధారాలుగా అందించింది. ఫర్హాన్ తన చెల్లిని కూడా లక్ష్యంగా చేసుకున్నాడని ఆమె చెప్పింది. ఇద్దరు నిందితులు కూడా ఆమెను లైంగిక చర్యల కోసం బలవంతం చేశారని, ఈ సంఘటనల సమయంలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు కూడా మత్తులో ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితురాలు తనకు జరిగిన అన్యాయాన్ని ఓ వ్యక్తితో పంచుకోవడంతో పోలీసులు ఈ కేసు గురించి తెలుసుకున్నారు. మహిళకు చాలా రోజులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆమె గుర్తింపు బయటపడకుండా, పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసులు మొదట నిందితులందరి స్థానాన్ని గుర్తించి, ఆపై వారిని అరెస్టు చేశారు. వారి ఫోన్‌లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంపై మరింత దర్యాప్తు జరుగుతోంది.
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!