ఫుడ్ ఆర్డర్ లేట్ అయ్యిందని ఓ వ్యక్తి డెలివరీ బాయ్ పై దాడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఫుడ్ ఆర్డర్ ఆలస్యంగా తెచ్చాడని డెలివరీ బాయ్‌పై దారుణంగా దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బెంగళూరులోని శోభా థియేటర్ సమీపంలో.. జొమాటోలో ఫుడ్ ఆర్డర్ పెట్టాడు ఓ వ్యక్తి. అది కాస్త ఆలస్యంగా డెలివరీ బాయ్ తీసుకు వచ్చాడు. దీంతో ఆర్డర్ ఎందుకు లేటుగా వచ్చావంటూ అతనిపై ఇద్దరు వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేశారు. వర్షంతో పాటు ట్రాఫిక్ సమస్యతో ఆలస్యమైందని చెప్పినా.. వినిపించుకోకుండా అతనిపై దాడి చేశారు. బైక్ పై డెలివరీ బాయ్ కూర్చోని ఉండగా.. మొదటి వ్యక్తి ప్లాస్టిక్ వాటర్ డబ్బాతో తీవ్రంగా దాడి చేశాడు. మరో వ్యక్తి కుర్చీతో ఆతన్ని తీవ్రంగా కొట్టాడు. అనంతరం అక్కడే ఉన్న స్థానికులు వారిని అడ్డుకున్నారు. ఈ విషయం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది.
జొమాటో డెలివరీ బాయ్, ఇద్దరు వ్యక్తుల నుంచి పోలీసులు స్టేట్‌మెంట్‌లు తీసుకున్నారు. ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో నెటిజన్‌లు రకరకాలుగా స్పందించారు. నిందితులపై నెటిజన్‌లు మండిపడ్డారు. వర్షం పడితే ట్రాఫిక్‌తో ఆలస్యం అవుతుందని, ఇలాంటి విషయంలో కొట్టడం తగదని డెలివరీ ఆలస్యం అయితే కస్టమర్‌కేర్‌కు కాల్ చేసి కంప్లైట్ ఇవ్వొచ్చని నెటిజన్‌లు కామెంట్స్ చేశారు.
ఫుడ్ ఆర్డర్ ఆలస్యంగా తెచ్చాడని.. డెలివరీ బాయ్‌పై దారుణంగా దాడి
బెంగళూరులోని శోభా థియేటర్ సమీపంలో.. జొమాటోలో ఫుడ్ ఆర్డర్ పెట్టగా, కాస్త ఆలస్యంగా వచ్చిన డెలివరీ బాయ్
దీంతో.. ఎందుకు లేటుగా వచ్చావంటూ అతనిపై విచక్షణారహితంగా దాడి చేసిన ఇద్దరు వ్యక్తులు
వర్షంతో పాటు ట్రాఫిక్ సమస్యతో… pic.twitter.com/cUxYAHNw9Y
— Telugu Scribe (@TeluguScribe) September 20, 2025