Wife Kills Husband: భర్తలను హత్యలు చేస్తున్న భార్యల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అక్రమ సంబంధాలు, పెళ్లి తర్వాత వేరే వారితో ప్రేమ వ్యవహరాల కారణంగా కట్టుకున్నవాడిని కడతేరుస్తున్నారు. తాజాగా, అస్సాంలో కూడా ఇలాంటి సంఘటన వెలుగులోకి వచ్చింది. భార్య, తన కుమార్తెతో కలిసి భర్తను హత్య చేసింది. దీనికి మరో ఇద్దరు యువకులు సహకరించారు. అయితే, హత్యను తప్పుదారి పట్టించేందుకు భార్య కట్టుకథ అల్లింది.
మహిళ, 9వ తరగతి చదువుతున్న తన కుమార్తె, ఇద్దరు అబ్బాయిలతో కలిసి హత్య చేశారు. వీరిందర్ని పోలీసులు ప్రస్తుతం అరెస్ట్ చేశారు. పోలీసుల్ని తప్పుదారి పట్టించేందుకు తన భర్త స్ట్రోక్‌తో మరణించాడని నమ్మించే ప్రయత్నం చేసింది. జూలై 25 జమీరాలోని లాహోన్ గావ్‌లోని బోర్బరువా ప్రాంతంలోని తన నివాసంలో ఉత్తమ్ గొగోయ్ మృతి చెంది కనిపించాడు. అతడి భార్య బాబీ సోనోవాల్ గొగోయ్, ఆమె కుమార్తెలు గుండెపోటుతో మరణించినట్లు చెప్పారు.
Read Also: US Car Crash: తప్పిపోయిన భారత సంతతి కుటుంబ.. 5 రోజుల తర్వాత మృతదేహాల గుర్తింపు..
అయితే, ఉత్తమ్ చెవిపై గాయం కనిపించడంతో అతడి సోదరుడు అనుమానం వ్యక్తం చేశాడు. ఆ సమయంలో ప్రశ్నిస్తే ఇంట్లో దొంగతనం జరిగినట్లు మరో కట్టుకథ చెప్పారు. స్ట్రోక్‌తో మరణిస్తే, అతని చెవిపై దెబ్బ ఎలా ఉంటుందనే అనుమానాన్ని మృతుడి సోదరుడు వ్యక్తం చేశారు. దీని తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. భార్య, ఆమె కుమార్తె, మరో ఇద్దరు యువకులు కలిసి హత్య చేసినట్లు తేలింది.
ఇద్దరు అబ్బాయిలు బాబీ, ఆమె కుమార్తెతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నట్లు సమాచారం. దిబ్రుగఢ్ ఎస్ఎస్‌పీ రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. నలుగురిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఆమె కుమార్తె నేరాన్ని అంగీకరించినట్లు వెల్లడించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బోర్బురువాలోని స్థానికులు పోలీస్ స్టేషన్ ముందు నిరసన చేపట్టారు.