మగువా.. మగువా లోకానికి తెలుసా నీ విలువ అనగానే ఆడవారికి చేతులెత్తి మొక్కుతారు.. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ అనగానే తల్లిని మించిన దైవం లేదని కొటేషన్స్ పెడతారు.. అంతే తప్ప నిజ జీవితంలో ఆడవారిని సురక్షితంగా తిరగనివ్వడంలేదు కామాంధులు.. గుడి, బడి.. ఆఫీస్, పార్క్.. అర్ధరాత్రి .. అపరాత్రి.. బస్సు, వ్యాన్.. చివరికి తండ్రి, అన్న, తమ్ముడు.. కూడా ఆడదాన్ని వదలడం లేదు. కామంతో కళ్ళుమూసుకొని మృగాళ్లుగా మారుతున్నారు. ముక్కుపచ్చలారని పసితనం.. మరెంతో జీవితాన్ని అనుభవించాల్సిన బాలిక.. ఎన్నో కలలతో కష్టపడి చదువుతున్న ఆమె ఆశలను కామాంధులు కల్లలు చేశారు.. ఆ లైంగిక వేధింపులు తట్టుకోలేని ఆ బాలిక తనకు ఈ లోకంలో రక్షణ లేదని, తనకు సమాధే సురక్షితమని లెటర్ రాసి మృత్యుఒడిలోకి జారుకోంది. ఈ దారుణ ఘటన తమిళనాడు లో వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే.. చెన్నై శివారులోని మాంగాడులో ఓ బ్యాంకు ఉద్యోగి తన భార్య పిల్లలతో నివసిస్తున్నాడు. అతని రెండో కుమార్తె స్థానికంగా ఉన్న కాలేజ్ లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఏమైందో ఏమో తెలియదు కానీ శనివారం అర్ధరాత్రిలో ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటానా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. ఆత్మహత్య చేసుకోవాల్సిన అంత భాద బాలికకు ఏమి వచ్చిందని కుటుంబాన్ని నిలదీశారు. ఎవరు నోరు మెదపలేదు.. ఆమె రూమ్ లో క్షుణ్ణం గా పరిశీలించగా సూసైడ్ లెటర్ కనిపించింది. అది చదివిన ప్రతి ఒక్కరి గుండె పగిలిపోయింది. పోలీసులు సైతం ఆ లెటర్ చదివి చలించిపోయారు.
క్రూర మృగాల మధ్య బతుకుతున్నానని, తనకు ఇక్కడ రక్షణ లేదని.. అందుకే సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళిపోతున్నట్లు రాసింది. ” మీరు ఎవరిని నమ్మకండి.. టీచర్లను, బంధువులను ఎవర్ని నమ్మకండి.. భరించలేని మనోవేదనతో భాధ పడుతున్నా.. మేల్కొన్నా .. నిద్రపోయినా ఆ లైంగిక వేధింపులే గుర్తొస్తున్నాయి. ఎవరికి చెప్పుకోలేను. ఈ సమాజంలో అమ్మాయిలకు రెండే సురక్షితమైన ప్రదేశాలు.. ఒకటి తల్లి గర్భం.. రెండు స్మశానం.. ఈ దారుణాలను ఆపేది ఎవరు.. నాకు న్యాయం కావాలి.. చిన్నతనం నుంచి నేను చదివిన స్కూల్లో మా టీచర్ కొడుకు వేధింపులు, ఆ తరువాత స్కూల్ మారినా ఆ వేధింపులు తగ్గలేదు, ఇది నేను ఒక్కదాన్నే అనుభవిస్తున్న భాద కాదు.. ఎంతోమంది నా తోటి విద్యార్థులు అనుభవిస్తున్న బాధ.. నా చావుతోనైనా ఈ వేధింపులు ఆగాలి.. అంటూ రాసుకొచ్చింది. ఇక ఈ లెటర్ ని ఆధారంగా చేసుకున్న పోలీసులు టీచర్ కుమారుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం బాలిక ఆత్మహత్య స్థానికంగా సంచలనంగా మారింది. ఇక ఈ వార్తపై హీరోయిన్ తాప్సి ట్విట్టర్ వేదికగా స్పందించింది. గుండె పగిలిపోయింది అని హార్ట్ ముక్కలయిన ఎమోజీని షేర్ చేసింది.
— taapsee pannu (@taapsee) December 20, 2021