A Private School Teacher Eloped With 10th Class Student In Hyderabad: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ ఉపాధ్యాయురాలు దారి తప్పింది. తాను పాఠాలు చెప్పే స్టూడెంట్‌తో ప్రేమాయణం నడిపింది. వయసులో తనకంటే చాలా చిన్నవాడు, మైనర్ అయిన బాలుడితో ఎఫైర్ పెట్టుకుంది. అంతటితో ఆగకుండా.. ఆ కుర్రాడితో ఉడాయించింది. అతడ్ని తీసుకొని పలు రాష్ట్రాలు తిరిగింది. ఇద్దరూ కలిసి బాగా ఎంజాయ్ చేశారు. కానీ, చివరికి పోలీసులకు అడ్డంగా బుక్కయ్యారు. హైదరాబాద్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..
Family Reunuion: పాక్‌లో అన్న, ఇండియాలో తమ్ముడు.. 75 ఏళ్ల తరువాత కుటుంబాల కలయిక
చందానగర్ పీఎస్ పరిధిలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో ఒక మహిళ టీచర్‌గా పని చేస్తోంది. తాను పాఠాలు చెప్పే పదో తరగతి కుర్రాడితో ప్రేమాయణం నడిపింది. గుట్టుచప్పుడు కాకుండా ఇద్దరూ తమ ఎఫైర్‌ని నడిపించారు. అయితే.. పది రోజుల క్రితం వీళ్లిద్దరూ ఒక్కసారిగా మాయం అయ్యారు. ఎవ్వరికీ అనుమానం రాకుండా ఉడాయించారు. స్కూల్‌కి వెళ్లిన వీళ్లిద్దరు తమ ఇళ్లకు తిరిగి రాకపోవడంతో.. అటు అబ్బాయి తల్లిదండ్రులు గచ్చిబౌలి పీఎస్‌లో, ఇటు టీచర్ పేరెంట్స్ చందానగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఇలా ఫిర్యాదులు అందుకున్న పోలీసులు.. వారి ఆచూకీ కోసం గాలించడం మొదలుపెట్టారు.
Iswarya Menon: మత్తెక్కించే కళ్ళతో మాయ చేస్తుందే..
మరోవైపు.. ఉడాయించిన ఆ టీచర్, స్టూడెంట్ పలు రాష్ట్రాలు తిరిగారు. పోలీసులకు, తమ కుటుంబ సభ్యులకు చిక్కకుండా ఉండేందుకు.. ఒకే చోట ఉండకుండా నచ్చిన ప్రాంతాలకు వెళ్లి, ఎంజాయ్ చేశారు. ఇలా పది రోజుల పాటు దొరక్కుండా తిరిగారు. చివరికి ఓ రాష్ట్రంలో వీరి ఆచూకీ లభ్యమవ్వడంతో.. పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరిని హైదరాబాద్ తీసుకొచ్చి, కౌన్సిలింగ్ ఇచ్చి, తిరిగి ఇళ్లకు పంపించారు.