A Police Constable Raghavendar Cheated Married Woman In Vikarabad: తమకు ఏదైనా సమస్య వస్తే.. జనాలు మొదటగా ఆశ్రయించేది పోలీసులనే! ఆపదలో ఉన్న తమని పోలీసులు తప్పకుండా రక్షిస్తారని ప్రజలు నమ్ముతారు. అలాంటి పోలీసులే భక్షకులైతే..? అందరూ కాదు కానీ, కొందరు మాత్రం తప్పుడు మార్గాల్లో పయనిస్తున్నారు. తమ కోరికల కోసం జనాలను బలిపశువును చేస్తున్నారు. ఇప్పుడు ఓ పోలీస్ కానిస్టేబుల్ కూడా.. ఒక మహిళని దారుణంగా మోసం చేశాడు. తనకు పెళ్లి కాలేదని చెప్పి దగ్గరై, శారీరకంగా వాడుకున్నాడు. తన బండారం బయటపడటంతో పారిపోయాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Social Media: గోల్డెన్ గుడ్డు రికార్డు పాయె.. ఇన్‌స్టాను షేక్ చేస్తున్న మెస్సీ ఫోటో
తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్‌లో రాఘవేందర్ అనే పోలీస్ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నాడు. ఇతనికి కొన్నాళ్ల క్రితం స్థానికంగా ఉండే ఒక వివాహిత పరిచయం అయ్యింది. ఆమె పట్ల ఆకర్షితుడైన రాఘవేందర్.. ఆమెకు దగ్గరయ్యాడు. తనకు పెళ్లి కాలేదని, నిన్ను ప్రేమిస్తున్నానని, పెళ్లి కూడా చేసుకుంటానని మాయమాటలు చెప్పాడు. ఆ కానిస్టేబుల్ మాటలు నమ్మిన వివాహిత.. అతని ప్రేమని అంగీకరించింది. ఈ క్రమంలోనే ఇద్దరూ శారీరకంగానూ దగ్గరయ్యారు. అయితే.. కొన్ని రోజుల తర్వాత రాఘవేందర్‌కు గతంలోనే పెళ్లి అయ్యిందని విషయం తెలిసింది. అది కూడా ఒకటి కాదు.. రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఇది తెలిసిన ఖంగుతిన్న ఆ మహిళ.. అతడ్ని నిలదీసింది. పెళ్లి కాలేదని ఎందుకు అబద్ధం చెప్పావంటూ వాగ్వాదానికి దిగింది. ఆమెకు సమాధానం చెప్పలేక రాఘవేందర్ ఇళ్లు వదిలి వెళ్లిపోయాడు. అలా వెళ్లిపోయిన అతను, మళ్లీ తిరిగి రాలేదు.
Kishan Reddy: అభివృద్ధి అంటే హైటెక్ సిటీ ఒక్కటేనా?
దీంతో.. ఆ వివాహిత రాఘవేందర్‌పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అతడు తనని మోసం చేశాడని, శారీరకంగా వాడుకొని వదిలేశాడని తన ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. పరీరాలో ఉన్న రాఘవేందర్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. శాఖ పరమైన చర్యల పరంగా అతడ్ని సస్పెండ్ కూడా చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ తెలిపారు. గతంలోనూ రాఘవేందర్ ఓసారి సస్పెండ్ అయ్యాడు.