ఎంతో చక్కని కుటుంబంలో వివాహేతర సంబంధం చిచ్చు పెట్టింది. ఒక పక్క భార్యతో గొడవలు.. ఇంకోపక్క ప్రియురాలిని వదిలి ఉండలేక ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తిరుపతిలో వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే.. హైదరాబాద్, చందా నగర్ కి చెందిన సాయి నవీన్ ని నాలుగేళ్ళ క్రితం కూకట్ పల్లి కి చెందిన యువతితో వివాహమైంది. వీరికి ఒక కుమారుడు ఉండగా.. ప్రస్తుతం అతని భార్య గర్భవతిగా ఉంది. ఇక ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొద్దీ రోజుల నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కకు తోడుగా ఉండడానికి వచ్చిన చెల్లెలు, బావ సాయి నవీన్ తో చనువుగా మాట్లాడడం మొదలుపెట్టింది. ఆ చనువు కాస్తా వారిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇటీవల వీరిద్దరి సంబంధం గురించి తెలుసుకున్న భార్య, భర్తను నిలదీసింది. దీంతో సాయి నవీన్, మరదలిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
మరదలికి మాయమాటలు చెప్పి మూడురోజుల క్రితం తిరుపతికి తీసుకెళ్లాడు. ఒక లాడ్జిలో గది అద్దెకు తీసుకొని పెళ్లి చేసుకుందామని మరదలిని అడగగా.. ఆమె అక్కకు అన్యాయం చేయాలేనన్ని తెలిపి నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. ఇక మరదలు లేని బతుకు నాకు వద్దనుకుని సాయి నవీన్ అదే గదిలో ఫ్యాన్ కి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం గది తలుపులు తెరిచిన హోటల్ సిబ్బందికి సాయి నవీన్ ఫ్యాన్ కి వేలాడుతూ కనిపించగా.. కొన ఊపిరితో కొట్టుకుంటూ మరదలు కనిపించింది. ఆమెను వెంటనే హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.