Crime News: ట్రాన్స్ జెండర్ ప్రేమకథ.. మోసం చేసి యువకుడు పరార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రేమ.. పలకడానికి రెండు అక్షరాలే. కానీ, నిజంగా ప్రేమించినవాళ్లకు ఆ పదం వెనుకున్న అసలు అర్థం ఏంటో తెలుస్తుంది. ప్రేమ అంటే ఒక బాధ్యత. కానీ, ఈ తరంలో కొందరు యువతీయువకులు మాత్రం దాన్ని టైంపాస్ గా తీసుకుంటున్నారు. తమ కోరికలు తీర్చుకోవడం కోసం ‘ప్రేమ’ను అడ్డగోలుగా వాడుకుంటున్నారు. ఫీలింగ్స్ తో ఆడుకుంటున్నారు. నిజంగా ప్రేమించిన వారిని దారుణంగా మోసం చేస్తున్నారు. ఇప్పుడు ఓ యువకుడు ప్రేమ పేరుతో ట్రాన్స్ జెండర్ ను మోసం చేసిన ఘటన తాజాగా హైదరాబాద్ లో వెలుగులోకి వచ్చింది.
ఇందిరా నగర్ లో నివాసముంటోన్న ట్రాన్స్ జెండర్ రోజాకు, స్థానికంగా ఉంటోన్న గోపీ అలియాస్ బాబు అనే అబ్బాయితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. రెండేళ్ల నుంచి ప్రేమించుకుంటోన్న వీళ్లిద్దరు.. ఏడాది నుంచి సహజీవనం చేస్తున్నారు. అయితే.. ఇప్పుడు బాబు ఆమెని వదిలేసి, మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఆల్రెడీ అతని ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. దీంతో రోజా పోలీసుల్ని ఆశ్రయించింది. బాబుకు అతని తల్లిదండ్రులు వేరే అమ్మాయితో ఖమ్మంలో నిశ్చితార్థం జరిపించారని, తనకు న్యాయం చేయాలని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. బాబుకు మొబైల్ స్విచ్చాఫ్ వస్తోందని, ట్రాన్స్ జెండర్ సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం వెళ్లి న్యాయ పోరాటం చేస్తానని రోజా తెలిపింది.
Also Read
- Chennai Crime: ప్రియురాలికి ఐఫోన్ గిఫ్ట్ కోసం చైన్ స్నాచింగ్.. పోలీసుకు పట్టించిన చొక్కా..!
- Home Delivery Tragedy: యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లో ప్రసవం.. భర్తపై కేసు..!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Ketan Agarwal Case: చదువులో జీరో.. ఇంటర్ ఫెయిల్ తర్వాత సియా ఏం చేసిందంటే..!
తమ వర్గానికి చెందిన రోజా మోసపోవడంతో.. పలువురు ట్రాన్స్ జెండర్ లు ఆమెకు బాసటగా నిలిచారు. రోజాను బాబు రెండేళ్లు వాడుకొని మోసం చేశాడని, ఇప్పుడు మరొక అమ్మాయితో నిశ్చితార్థం చేసుకోవడం ఎంతవరకు సమంజసమని ట్రాన్స్ జెండర్ ప్రతినిధి సోనీ రాథోడ్ ప్రశ్నించారు. వేరే అమ్మాయిని బాబు పెళ్లి చేసుకుంటే, ఆ అమ్మాయి జీవితం నాశనమవుతుందని, బాబుపై తాము బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని అన్నారు. తమకు న్యాయం చేయాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.
తాజావార్తలు
-
Unused Apps: మీ ఫోన్లో ఈ యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేయండి.. లేదంటే మీ పర్సనల్ డేటా గోవింద..!
-
Acer TravelLite TL24-54M: భారత్ లో ఏసర్ ట్రావెల్ లైట్ TL24-54M ల్యాప్‌టాప్ విడుదల.. DDR5 RAM సపోర్ట్, AI ఫీచర్లు
-
Tridha: బాబీ డియోల్‌తో బోల్డ్ సీన్లే బ్రేకప్‌కు కారణమా? మాజీ ప్రియుడిపై షాకింగ్ కామెంట్స్ చేసిన త్రిధా!
-
Mavigan vs Amaravati: నెక్ట్స్ ఫైట్ ‘మావిగన్ వర్సెస్ అమరావతి’.. వైఎస్ జగన్ సవాల్..
-
Kohinoor: ఈ వజ్రం కోసం యుద్ధాలు ఎందుకు జరిగాయి? శతాబ్దాలుగా వీడని మిస్టరీ!
ట్రెండింగ్
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్‌ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్‌ఫాస్ట్ ఫ్రీ..