Uttar Pradesh: దొంగలు తెలివిమీరారు. ఐదో తరగతి చదువుకుని, ఆటో రిక్షా తొక్కుతూ జీవనం సాగించే వ్యక్తి కార్ల దొంగతనాల కోసం పెద్ద ముఠానే ఏర్పాటు చేసుకున్నాడు. లగ్జరీ కార్లను దొంగతనం చేసేందుకు యూట్యూబ్, సాఫ్ట్‌వేర్ సాయంతో 500కి పైగా కార్లను దొంగతనం చేశారు. నిరక్షరాస్యులైనప్పటికీ.. యూట్యూబ్‌లో కార్ల దొంగతనం ఎలా చేయాలో నేర్చుకుని అమలు చేశారు. తాజ్ మహ్మద్ అనే వ్యక్తి తొలిసారిగా రౌనక్ అలీ అలియాస్ బాబుతో పరిచయం పెంచుకున్నాడు.
Car theft: ఓ కారు దొంగతనం ముగ్గురు యువకులను తీవ్ర ఇబ్బందులు పెట్టింది. డబ్బులు సంపాదించాలనుకున్న ముగ్గురు యువకులు కారును దొంగిలించి, చివరకు పట్టుబడ్డారు. అయితే ఇక్కడే ట్విస్ట్ ఉంది. కారునైతే దొంగిలించారు కానీ.. ఆ ముగ్గురిలో ఒక్కరికి కూడా కార్ డ్రైవింగ్ రాదు. సక్సెస్ ఫుల్ గా దొంగతనం చేశారు కానీ.. తమకు డ్రైవింగ్ రాదన్న విషయాన్ని మరిచిపోయారు. చివరకు పోలీసులకు పట్టుబడ్డారు.