Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema Reviews Ninnila Ninnila Movie Review

రివ్యూ : ఫీల్ గుడ్ రొమాంటిక్ డ్రామా ‘నిన్నిలా నిన్నిలా’!

Published Date :March 7, 2021 , 1:10 pm
By newsdesk
రివ్యూ : ఫీల్ గుడ్ రొమాంటిక్ డ్రామా ‘నిన్నిలా నిన్నిలా’!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్‌ గత యేడాది డిసెంబర్ 25న ‘సోలో బ్రతుకే సో బెటర్’ మూవీని విడుదల చేశారు. ఇంతవరకూ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమాలను నిర్మించిన ఆయన బ్యానర్ నుండి వచ్చిన కాస్తంత డిఫరెంట్ మూవీ ‘నిన్నిలా నిన్నిలా’. పలు తమిళ చిత్రాలతో పాటు తాజాగా మలయాళ చిత్రసీమలోకి అడుగుపెట్టిన హీరో అశోక్ సెల్వన్ కు ఇది తొలి తెలుగు సినిమా. ఇక బబ్లీ గర్ల్స్ నిత్యామీనన్, రీతూ వర్మ ఇందులో హీరోయిన్లుగా నటించారు. దివంగత దర్శకుడు ఐ.వి. శశి కుమారుడు అని శశి ఫస్ట్ టైమ్ తెరకెక్కించిన ఈ మూవీ ప్రస్తుతం జీప్లెక్స్ లో అందుబాటులో ఉంది. 

కథ విషయానికి వస్తే…. దేవ్ (అశోక్ సెల్వన్) ఓ షెఫ్. యు.కె.లోని అమరా రెస్టారెంట్ లో ఉద్యోగం రావడంతో హైదరాబాద్ నుండి అక్కడికి వెళతాడు. అతని కంటే నెల రోజుల ముందే తారా (రీతువర్మ) ఆ రెస్టారెంట్ లో షెఫ్ గా చేరుతుంది. ఓవర్ వెయిట్ తో పాటు నరాల బలహీనతతోనూ బాధపడుతుండే దేవ్ ను చూసి కొలిగ్స్ జాలి పడుతుంటారు. ఈ రెండే కాదు… అతనికి ఇన్సోమ్నియా సమస్య కూడా ఉంటుంది. యుక్త వయసులోనే రకరకాల సమస్యలతో బాధపడుతున్న దేవ్ గతం ఏమిటీ? అతని జీవితంలోకి కొత్తగా వచ్చిన తారతో ఎలాంటి అనుబంధం ఏర్పడింది? నిన్నటి రోజున దేవ్ జీవితంలో ఉన్న మాయ (నిత్యామీనన్) ఏమై పోయింది? ఈ ప్రశ్నలకు సమాధానం ఈ సినిమాలో మనకు కనిపిస్తుంది.

అశోక్ సెల్వన్ నటించిన తమిళ చిత్రం ‘ఓ మై కడువులే’ త్వరలో తెలుగులో రీమేక్ కాబోతోంది. ఈ సినిమాకు విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. నటుడిగా అతనికంటూ ఓ గుర్తింపును తక్కువ సినిమాలతోనే అశోక్ తెచ్చుకున్నాడు. ఇందులో వంద కేజీలకు పైగా బరువువుండే యువకుడి పాత్ర పోషణ కోసం గట్టి ప్రయత్నమే అశోక్ చేశాడు. ఏకంగా ఇరవై కేజీల బరువు పెరిగాడు. పోస్థటిక్ మేకప్ ను ఉపయోగించినా తన వంతు ప్రయత్నం అతనూ చేశాడు. కొన్ని సన్నివేశాల్లో అతని ఆకారాన్ని, బాడీ లాంగ్వేజ్ ను చూస్తే ‘ఇంద్రుడు చంద్రుడు’లోని సీనియర్ కమల్ హాసన్ పాత్ర జ్ఞప్తికి వస్తుంది. రీతువర్మ ఇప్పుడిప్పుడే నటిగా తానేమిటో నిరూపించుకుంటోంది. ఈ సినిమాలో ఆమె నటన చాలా హుందాగా, సెటిల్డ్ గా బాగుంది. నిత్యా మీనన్ ద్వితీయార్థంలోనే తెర మీదకు వచ్చినా… మాయా పాత్రలో ఒదిగిపోయింది. ముఖ్యంగా దేవ్ – మాయా మధ్య ఉండే ఫ్రెండ్ షిప్ అండ్ లవ్ కెమిస్ట్రీ… నిత్యామీనన్ సహజ నటన కారణంగా ఎలివేట్ అయ్యింది. ఈ సినిమాను ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా మార్చింది నిత్యామీనన్ అనే చెప్పాలి. ఇందులో మరో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి నాజర్. లండన్ లోని అమరా రెస్టారెంట్ ఓనర్ కమ్ చీఫ్ షెప్ గా ఆయన చక్కని పాత్రను పోషించారు. కమెడియన్ సత్య పాత్ర కూడా చాలా బాగుంది. హీరో తల్లిదండ్రులుగా సంధ్యా జనక్, కేదార్ శంకర్ నటిస్తే, నిత్యా మీనన్ తల్లిగా కల్పవల్లి, సైకియాట్రిస్ట్ గా బ్రహ్మాజీ నటించారు. 

సహజంగా ఇలాంటి సింపుల్ రొమాంటిక్ లవ్ స్టోరీస్ అన్ని వర్గాలను ఆకట్టుకోవు. పైగా అది రెస్టారెంట్ బ్యాక్ డ్రాప్ లో షెఫ్స్ కు సంబంధించిన కథ అయినప్పుడు! ఆ వాస్తవాన్ని గ్రహించే కాబోలు నిర్మాత బీవీఎస్ ఎన్ ప్రసాద్ దీనిని థియేట్రికల్ రిలీజ్ చేయకుండా, జీప్లెక్స్ లో పే ఫర్ వ్యూ సిస్టమ్ లో  చూసే సదుపాయం కల్పించారు. ఇందులో చిన్నప్పటి నుండీ స్నేహితులుగా మెలిగే దేవ్, మాయ మధ్య ఉన్న అనుబంధాన్ని కాస్తంత అతిగానే చూపించారు. ఒకే కంచం.. ఒకే మంచంగా వారు యుక్తవయసు వచ్చాక కూడా మెసలడం అనేది కాస్తంత ఎబ్బెట్టుగా ఉంది. ఇక సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే… ‘కేశవ, రణరంగం’ వంటి తెలుగు సినిమాలకు సినిమాటోగ్రఫీ అందించిన దివాకర్ మణి ఈ చిత్రానికి వర్క్ చేశాడు. అతని కెమెరాపనితనం, లైటింగ్ ప్యాట్రన్ అద్భుతం. సీనియర్ సినిమాటోగ్రాఫర్స్ ను గుర్తు చేశాడు. లండన్ తో పాటు చార్మినార్ సమీపంలో తీసిన సన్నివేశాలు చాలా బాగున్నాయి. రాజేశ్‌ మురుగేశన్ సంగీతం ఈ సినిమాకు మరో హైలైట్. ఆర్టిస్టుల హావభావాలకు, బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగా మైన్యూట్ డీటేల్స్ ను గుర్తించి చక్కని నేపథ్య సంగీతం అందించాడు. గతంలో అశోక్ సెల్వన్ – అని శశి కలిసి ‘మాయా’ అనే షార్ట్ ఫిల్మ్ చేశారు. అంతర్జాతీయంగా దానికి మంచి గుర్తింపు వచ్చింది. తొలిసారి తాను దర్శకత్వం వహిస్తూ అశోక్ సెల్వన్ నే హీరోగా పెట్టుకోవడం ఓ విశేషం అయితే… ఇందులోని నిత్యామీనన్ పాత్రకు మాయా అనే పేరు పెట్టడం మరో విశేషం. ఈ మూవీని  తమిళంలో ‘తీని’ పేరుతో అని శశి తెరకెక్కించాడు.  హీరో అశోక్ సెల్వన్, దర్శకుడు అనికి అక్కడ ఉన్న గుర్తింపు కారణంగా తమిళులను ఈ సినిమా ఎక్కువ ఆకట్టుకునే ఆస్కారం ఉంది. ఏదేమైనా… రొటీన్ కమర్షియల్ సినిమాలకే ప్రాధాన్యం ఇవ్వకుండా బీవీఎస్ఎన్ ప్రసాద్ లాంటి సీనియర్ నిర్మాత ఇలాంటి చిన్న చిన్న ఫీల్‌ గుడ్ సినిమాలనూ అప్పుడప్పుడు తీస్తుంటే బాగానే ఉంటుంది.

ప్లస్ పాయింట్స్
ప్రధాన తారాగణం నటన
ఆకట్టుకునే దివాకర్ మణి సినిమాటోగ్రఫీ
హృదయానికి హత్తుకునే సంగీతం

మైనెస్ పాయింట్స్
ఆసక్తి రేకెత్తించని టైటిల్
కాస్తంత తమిళ వాసనలు


రేటింగ్ 2.25 / 5

ట్యాగ్ లైన్
రొమాంటిక్ డ్రామా!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ashok selvan
  • ninnila ninnila
  • review
  • tirhu varma
  • Tollywood

తాజావార్తలు

  • Off The Record: నూజివీడు నియోజకవర్గంలో మంత్రి పార్థసారథికి తలనొప్పులు

  • Deep Sleep Tips : చిటికెలో గాఢ నిద్రలోకి జారుకోవాలంటే.. ఈ చిన్న చిట్కాలు పాటిస్తే చాలు..!

  • CM Revanth Reddy : నల్ల చెరువుకు పూర్వవైభవం.. నాడు చేయలేకపోయా.. నేడు చేసి చూపిస్తున్నా..

  • Hyderabad: హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య.. పని ఒత్తిడి తట్టుకోలేకనే ఇలా..!

  • Off The Record: తహసీల్దార్లకు షోకాజ్ నోటీసులివ్వడం వెనుక ఆంతర్యం ఏంటి?

ట్రెండింగ్‌

  • Kidney Stones in Children : తల్లిదండ్రులు ఈ తప్పు చేస్తే.. చిన్న పిల్లల్లోనూ కిడ్నీ రాళ్లు.. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే.!

  • Late Night Hunger : అర్ధరాత్రి ఆకలి వేస్తుందా..? కారణం ఇదే అంటున్న డాక్టర్లు..!

  • Black Hair Tips : ఇక రంగు వేయాల్సిన పనిలేదు.. ఈ చిన్న విషయం తెలుసుకుంటే చాలు…!

  • Jasprit Bumrah Bowling: పిసినారి ‘బుమ్రా’.. భారత్ ఫైనల్ చేరడానికి కారణం ఆ మూడు ఓవర్లే!

  • 8.12 అంగుళాల డిస్‌ప్లే, Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్‌ తో వచ్చేస్తున్న OPPO Find N6..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions