ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ గత యేడాది డిసెంబర్ 25న ‘సోలో బ్రతుకే సో బెటర్’ మూవీని విడుదల చేశారు. ఇంతవరకూ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమాలను నిర్మించిన ఆయన బ్యానర్ నుండి వచ్చిన కాస్తంత డిఫరెంట్ మూవీ ‘నిన్నిలా నిన్నిలా’. పలు తమిళ చిత్రాలతో పాటు తాజాగా మలయాళ చిత్రసీమలోకి అడుగుపెట్టిన హీరో అశోక్ సెల్వన్ కు ఇది తొలి తెలుగు సినిమా. ఇక బబ్లీ గర్ల్స్ నిత్యామీనన్, రీతూ వర్మ ఇందులో హీరోయిన్లుగా నటించారు. దివంగత…